»   » ‘వేట’కు సిద్ధమైన తరుణ్, శ్రీకాంత్ (ఫోటోలు)

‘వేట’కు సిద్ధమైన తరుణ్, శ్రీకాంత్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'తేజ సినిమా' పతాకం పై శ్రీకాంత్, తరుణ్ హీరోలుగా నటించిన సినిమా 'వేట'. సి.వి. రావు నిర్మిస్తోన్న ఈ మూవీకి అశోక్ అల్లే దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయవంతం అయిన నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరిగింది.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ..'ఈ సినిమాకి కొత్త లిరిక్స్ ఇచ్చాయి. పాటలను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది' అన్నారు.

ఈ కార్యక్రమంలో తరుణ్, నాని, మధురిమ, జాస్మిన్, దర్శకుడు అశోక్ అల్లె, గౌతం రాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

తరుణ్

తరుణ్

హీరో తరుణ్ మాట్లాడుతూ..' ఈ మూవీలో చాలా మంది సీనియర్స్ పనిచేస్తున్నారు. వారితో నటించడం ఆనందంగా ఉంది. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్ సంగీతం. చక్రితో నాకిది మూడో సినిమా అన్నాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్

కమర్షియల్ ఎలిమెంట్స్

ఇది ప్రాపర్ యాక్షన్ మూవీ. సెంటిమెంట్, ఫ్యామిలీ, యూత్ ఫుల్ మూవీ. అశోక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీనాధ్ గారు చాలా పవర్ ఫుల్ డైలాగులు ఇచ్చారు. శ్రీకాంత్ గారి కాంబినేషన్ లో సినిమా చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది అని తరుణ్ చెప్పుకొచ్చారు.

వేట

వేట

తేజా సినిమా బ్యానర్ పై సి.కళ్యాణ్ సమర్పణలో సి.వి.రావు, పి.శ్వేతలానా, సి.వరుణ్ కుమార్, నిర్మాతలుగా అశోక్ పల్లె దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట'. ఈ నెల 21న విడుదలకానుంది.

నటీనటుల

నటీనటుల


శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్, అజాజ్ ఖాన్, కృష్ణ భగవాన్, చిత్రం శ్రీను, వేణు, రఘు, సత్తెన్న తదితరులు నటించారు.

సి కళ్యాణ్ మాట్లాడుతూ...

సి కళ్యాణ్ మాట్లాడుతూ...


300థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. సెంటిమెంట్, లవ్ సమపాళ్లలో ఉన్న సినిమా ఇది. ఒక్క రీ-రికార్డింగ్ కే 22రోజులు పట్టింది. రీ-రికార్డింగ్ కి అంత స్కోప్ ఉన్న చిత్రం ఇది. చిత్ర దర్శకుడు అశోక్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా ఓ కొత్త దర్శకుడు తీసినట్లుగా ఉండదు అన్నారు.

English summary

 Veta Movie Platinum Disc Function held at Hyderabad. Actor Tarun, Nani, Actress Madhurima Banerjee, Jasmin Bhasin, Director Ashok Alle, Editor Gautham Raju, Music Director Chakri graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu