»   » విలన్ గా మారిన ఇంకో హీరో... రొమాంటిక్ హీరో నుంచి రఫ్‌లుక్ లోకి

విలన్ గా మారిన ఇంకో హీరో... రొమాంటిక్ హీరో నుంచి రఫ్‌లుక్ లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీతాకోకచిలుక , అభినందన, అన్వేషణ వంటి సినిమాలతో దశాబ్థం క్రితం తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో కార్తీక్ .ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ హీరో ప్రస్తుతం అనేక ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. గతంలో అనేక సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ఆస్తులను బాగానే సంపాదించుకున్నారు. కాని ఆ తర్వాత ఈయన పరిస్థితి పూర్తిగ మారింది. ప్రస్తుతం తన ఆస్తికి సంబంధించి , సొంత వాళ్ళతోనే వివాదాలకు దిగాల్సిన పరిస్థితి ఈ తమిళ హీరోకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి.వాటి ప్రభావమో ఏమో గానీ కార్తీక్ మళ్ళీ నటనలో అడుగు పెడుతున్నాడు... అదీ మనం ఊహించని విధంగా.

Veteran actor Karthik plays villain Role in Suriya's film

ఒకప్పుడు హీరోలుగా రాణించిన నటులు కాలక్రమంలో విలన్లు గా మారిపోవటం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆ కోవలో జగపతిబాబు, అరవింద్ స్వామి వంటి ఆర్టిస్టులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఒకప్పటి రొమాంటిక్ హీరో కార్తీక్ కూడా ఇప్పుడు విలన్ గా మారాడు. ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య నటిస్తున్న చిత్రంలో కార్తీక్ ఇలా విలన్ గా నటిస్తున్నాడు. సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సేర్న్ దా కూట్టం' అనే తమిళ సినిమా రూపొందుతోంది. ఇందులో కార్తీక్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది విలనిజంతో కూడిన పాత్ర అంటూ తాజాగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సూర్య, కార్తీక్ మధ్య నడిచే కొన్ని కీలక సన్నివేశాలను ఈ చిత్రం కోసం చిత్రీకరిస్తున్నారు.

English summary
Reports are doing the rounds that Karthik has been cast in Suriya's Thaana Serndha Koottam, which is progressing at a brisk pace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu