»   » తీవ్ర అస్వస్థత...హాస్పటిల్ లో

తీవ్ర అస్వస్థత...హాస్పటిల్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై:ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు మనోజ్‌ కుమార్‌(78) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం గురువారం ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

సిని ఇండస్ట్రీలో భరత్‌ కుమార్‌గా పిలవ బడే మనోజ్‌ కుమార్‌ 'హరియాలీ ఔర్‌ రాస్తా', 'వో కౌన్‌ థీ?', 'హిమాలయ కీ గాడ్‌ మెయిన్‌', 'దో బదన్‌', 'ఉప్కర్‌', 'పత్తర్‌ కే సనమ్‌', 'నీల్‌ కమల్‌', 'పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌', 'రోటీ కపడా ఔర్‌ మకాన్‌' వంటి దేశభక్తి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Veteran actor Manoj Kumar hospitalised

దాదాపు 55 సినిమాలు చేసిన ఆయన ఏడు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. దర్శకత్వం వహిస్తూ నటించిన 'ఉప్కర్‌' చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. అంతేకాదు నటుడిగా, దర్శకుడిగా భారతీయ సినిమాకు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ అవార్డుతో సముచితంగా గౌరవించింది.

English summary
Veteran actor Manoj Kumar has been admitted in Kokilaben Hospital, Mumbai.
Please Wait while comments are loading...