»   » గుండెపోటు: ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగూ ఇక లేరు

గుండెపోటు: ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగూ ఇక లేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగో ఇక లేరు. గురువారం తెల్లవారుఝామున ఆమె గుండెపోటుతో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.

రీమా లాగూ బాలీవుడ్ సినిమాలతో పాటు మరాఠీ చిత్రాల్లో నటిచారు. సల్మాన్ ఖాన్ తల్లిగా 'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించిన తర్వాత ఆమె బాగా పాపులర్ అయ్యారు. తర్వత అనేక చిత్రాల్లో హిందీ, మరాఠీ నటించారు.

Veteran actor Reema Lagoo passes away

రీమా లాగూ అసలు పేరు గురిందెర్ భాద్బాదె. పుణెలోని హుజుర్పాగా హెచ్‌హెచ్‌సిపి హైస్కూల్ లో చదువుకున్నారు. స్కూలు రోజుల నుండే నాటకాల్లో చురుకుగా పాల్గొనేవారు. చదువు అయిపోయిన వెంటనే నటిగా కెరీర్ మొదలు పెట్టారు.

తొలుత మరాఠీ నాటకాల్లో నటించిన ఆమె 1970ల్లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. మరాఠీ నటుడు వివేక్ లాగూను పెళ్లాడారు. తర్వాత తన పేరును రీమా లాగూగా మార్చుకున్నారు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు. వీరికి మృన్మయీ అనే కూతురు ఉంది. ఆమె కూడా నటిగా కొనసాగుతున్నారు.

English summary
Veteran actor Reema Lagoo passed away this morning after suffering a cardiac arrest. She passed away at the Kokilaben Dhirubhai Ambani hospital in Mumbai. She has acted in several films, both Hindi and Marathi. She is famous for playing Salman Khan's mother in the movie Maine Pyar Kiya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu