twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌ నటుడు సదాశివ్‌ అమ్రాపుర్కర్‌ కన్నుమూత

    By Srikanya
    |

    ముంబయి : బాలీవుడ్‌ నటుడు సదాశివ్‌ అమ్రాపుర్కర్‌(64) కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అర్ధ్‌ సత్య, సడక్‌, ఆంఖే, ఇష్క్‌, కూలీ నెం.1, గుప్త్‌ తదితర చిత్రాల్లో సదాశివ్‌ నటించారు.

    1984లో వచ్చిన అర్ధ్‌ సత్య చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా, 1991లో వచ్చిన సడక్‌లో ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 2012లో వచ్చిన బాంబే టాకీస్‌ చిత్రం సదాశివ్‌ ఆఖరి చిత్రం. సదాశివ్‌ అంత్యక్రియలు అహ్మద్‌నగర్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో రేపు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

    Veteran actor Sadashiv Amrapurkar dies at 64

    గత కొంత కాలంగా సదాశివ్ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ పడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ ఉదయం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో మృతి చెందాడు. సదాశివ్ నటనకు గుర్తింపుగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. హిందీతో పాటు పలు మరాఠీ చిత్రాల్లో సదాశివ్ నటించారు. సదాశివ్ ఆఖరి చిత్రం బాంబే టాకీస్.

    నాలుగైదు రోజులక్రితమే... సదాశివ్ అమ్రాపుర్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఆయన కూతురు రీమా తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా సదాశివ్ కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. 'సదాశివ్ జీ ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపడిందని, వెంటిలెటర్ ద్వారా శ్వాసనందిస్తున్నారు. ఆయన గురించి మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మకండి. మీడియాకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అందిస్తాను' అని మీడియాకు పంపిన ఓ ప్రకటనలో రీమా తెలిపారు.

    English summary
    Veteran Bollywood actor Sadashiv Amrapurkar who is known for his stellar performances in villainous roles in movies like Sadak, Ishq and Ardh Satya, died on Monday morning at the Kokilaben Dhirbubhai Ambani Hospital in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X