»   » సీనియర్ నటి అంజలీదేవికి శతాభిషేకం

సీనియర్ నటి అంజలీదేవికి శతాభిషేకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ నటి..డాక్టర్ అంజలీదేవికి ఈరోజు (శనివారం) 'శతాభిషేకం' జరుగనుంది. ఈ పంక్షన్ కి శ్రీ సత్యసాయిబాబా ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.అంజలీదేవికి ఎనభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె మనవరాలు విజయలక్ష్మి శుక్రవారం మీడియాకు తెలిపారు. చెన్నై ఆర్ఏ పురంలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ కేంద్రంలో ఉదయం 10.30 గంటల నుంచి ఈ అభిషేకం జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. కుటుంబసభ్యులు, పలు సినీ, తెలుగు సంస్థలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కరుణానిధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె రోశయ్య, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తదితర రాజకీయ నేతల్ని, సినీ, పారిశ్రామిక ప్రముఖుల్ని ఆహ్వానించారు. అయితే జయలలిత శనివారం ఉదయం చెన్నయ్ నుంచి కొడనాడు ఎస్టేట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అందువల్ల ఆమె శుక్రవారమే అంజలీదేవి ఇంటికి వచ్చి శాలువా కప్పి అభినందనలు తెలిపివెళ్లారు. అంజలీదేవి శతాభిషేకంలో పాల్గొని ఆమెను ఆశీర్వదించేందుకే సత్యసాయిబాబా పుట్టపర్తి నుంచి శనివారం నాడు చెన్నయ్ వస్తున్నారు. ఈ సీనియర్ నటీమణికి ఇలాగే మరిన్ని సన్మానాలు, సత్కారాలు జరగాలని ధట్స్ తెలుగు ఆశిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu