twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పాతాళభైరవి' ఆర్ట్ డైరక్టర్ కన్నుమూత

    By Srikanya
    |

    Kaladhar
    చెన్నై : తెరపై పాతాళభైరవి రూపాన్ని సాక్షాత్కరింపజేసిన కళాకారుడాయన. ఆయన స్కెచ్‌లు చూసి ఎలాంటి దర్శకులైనా ముచ్చటపడాల్సిందే. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే ఆశ్చర్యచకితుల్ని చేసేలా మినియేచర్లు తీర్చిదిద్దారు. ఆయనే సూరపనేని కళాధర్‌. తెలుగు సినిమా తొలి అడుగులు వేసే దశలో కళా దర్శకత్వం వైపు అడుగులు వేశారు కళాధర్‌.

    ఆయన శనివారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వయసు 98 సంవత్సరాలు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఎలకపాడు ఆయన స్వస్థలం. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కళాధర్‌ చిన్నతనంలోనే చిత్రలేఖనంపై పట్టు సాధించారు. ఆయన 1945లో 'గృహప్రవేశం' ద్వారా కళా దర్శకుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'గుండమ్మకథ', 'పాతాళభైరవి', 'మాయాబజార్‌' లాంటి పలు చిత్రాలకు కళా దర్శకులుగా పని చేశారు. మా గోఖలేతో కలిసి ఆయన పలు చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు. తమిళంలోనూ పలు సినిమాలకు ఆయన సేవలం దించారు.విజయా సంస్థ నుంచి విడుదలైన దాదాపు అన్ని చిత్రాలకు కళా దర్శకుడిగా పని చేశారు.

    కళాధర్‌ అనారోగ్యానికి గురవడంతో రెండు వారాల కిందట చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం కోడంబాక్కంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కళాధర్‌ పార్థివదేహానికి విజయా గ్రూపు సంస్థల అధినేత బి.వెంకట్రామిరెడ్డి, ఎమ్‌.ఎస్‌.మూర్తి తదితరులు నివాళులర్పించారు. కళాధర్‌ మృతి పట్ల నృత్య దర్శకులు శ్రీను మాస్టర్‌ సంతాపం ప్రకటించారు.

    తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో శతాధిక చిత్రాలకు కళా దర్శకుడిగా పని చేసి కీర్తి గడించిన కళాధర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు లభించకపోవడం శోచనీయం. ఈయన భౌతిక కాయానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నాంబ పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

    English summary
    
 Famous art director, Kaladhar, has passed away in Chennai. He has worked as the art director for evergreen classic films like 'Pathala Bhairavi', 'Mayabazar', NTR's 'Raja Kota Rahashyam' etc, and he is considered as one of the best art directors in India at that time. The film industry has conveyed their deep condolences at his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X