twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత,దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్‌(82) కన్ను మూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ ఇషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వి.బి రాజేంద్రప్రసాద్‌ పూర్తి పేరు వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్‌. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజేంద్రప్రసాద్‌ కుమారుడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడలో 1932 నవంబరు 4న జన్మించారు.

    వి.బి.రాజేంద్రప్రసాద్ పూర్తి పేరు వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్. బాల్యం నుంచే ఆయన ఆస్తమా వ్యాధితో బాధపడుతూ వస్తున్నారు. రాఘవ కళాసమితి ద్వారా వి.బి.రాజేంద్రప్రసాద్ రంగస్థలంకు పరిచయమయ్యారు. నటుడిగా కావాలని సినిరంగంలో ప్రవేశించి నిర్మాతగా స్థిరపడ్డారు. జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థలను స్థాపించారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 1965లో అంతస్తులు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు.

    Veteran Telugu Filmmaker Rajendra Prasad Passes Away

    జగపతి ఆర్ట్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ తొలుత నాటకాలు వేసేవారు. రాఘవ కళాసమితి ద్వారా ఆయన రంగస్థలానికి పరిచయమయ్యారు. నటుడు అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 16 చిత్రాలను నిర్మించారు. 1965లో అంతస్తులు చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దసరాబుల్లోడు చిత్రంతో ఆయన మెగాఫోన్‌ పట్టి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. మొత్తం 14 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కెప్టెన్‌ నాగార్జున, బంగారుబాబు చిత్రాలకు రచయితగా పనిచేశారు.

    అక్కినేని నాగేశ్వర్‌రావుతో ఆరాధన అనే రెండో చిత్రాన్ని నిర్మించారు. తర్వాత ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెల్లు, దసరాబుల్లోడు, బంగారుబాబు, కిల్లర్, సింహస్వప్నం, భార్యాభర్తల బంధం, బంగారుబొమ్మలు, పిచ్చిమారాజు వంటి మంచి చిత్రాలను నిర్మించారు. నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో దైవసన్నిధానం నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. అరవై, డ్బ్బై దశకాల్లో అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. 16 చిత్రాలను నిర్మించి తెలుగులో మేటి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. దసరా బుల్లోడు సినిమాతో దర్శకుడిగా మారారు. 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కెప్టెన్ నాగార్జున, బంగారుబాబు వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు.

    English summary
    Veteran Telugu film producer and director V B Rajendra Prasad passed away due to age related ailments at a hospital. He was 82. His films like 'Aradhana', 'Dasara Bullodu', 'Atma Balam' were huge hits and he won National Award for his film 'Antastulu'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X