శేఖర్ కమ్ముల చిత్రంలో వైభవ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశం వైభవ్‌కి దక్కింది. శేఖర్ ప్రస్తుతం 'కహానీ' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. ఈ సినిమాకి 'అనామిక' అనే పేరుని ఖరారు చేశారు.
ఇందులో వైభవ్ పోలీసు కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సన్నివేశాలు చిత్రిస్తున్నారు.
ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications












