విడుదల కాక ముందే 'విక్టరీ' కి విక్టరీ

అది నితిన్ నటించిన విక్టరీ కావటం విశేషం. దాదాపుగా వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఇది మనో ధైర్యాన్నిస్తోందిట. ఎందుకంటే విడుదల కాకముందే ఒక తెలుగు సినిమా తమిళ రీమేక్ హక్కులు అమ్ముడవటం అంటే మాటలు కాదు. రవి సి. కుమార్ దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బానర్‌పై వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మమతా మోహన్‌దాస్ నటించిన ఈ చిత్రంలో శశాంక్, సింధూ తులానీ మరో జంట. ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో నితిన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. సినిమాలో అతని పాత్ర, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గురించి విన్న తరువాతే హీరో విజయ్, తమిళంలో ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. హక్కులు కూడా తీసుకున్నాడు. కాగా 'విక్టరీ" జూన్ 22న విడుదల కానున్నది. యేదేమైనా విక్టరీ రిలీజు కాక ముందే విక్టరీ సాధించినట్లయింది.


Click it and Unblock the Notifications











