»   » చిన్నప్పటి ఆ పుస్తకం గుర్తుందా..? ఇప్పుడు వెంకీ సినిమా అదే

చిన్నప్పటి ఆ పుస్తకం గుర్తుందా..? ఇప్పుడు వెంకీ సినిమా అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బారిష్టర్ పార్వతీశం ఓ నవల అనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. మూడు భాగాలుగా వెలువడ్డ ఈ కథలో మొదతి భాగానికి సంబందించిన నవలనే తెలుగు అకాడమి పుస్తకాల్లో పదవతరగతి ఉపవాచాకముగా అందించారు. చిన్నప్పుడు స్కూల్లో తెలుగు పుస్తకాలు తిరగేసినవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.

మొక్కపాటి నరసింహశాస్త్రి

మొక్కపాటి నరసింహశాస్త్రి

అంతలా తెలుగువాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన ‘బారిష్టర్ పార్వతీశం' ఓ నవల అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. 1924లో మొక్కపాటి నరసింహశాస్త్రి కలం నుంచి వెలువడిన అద్భుతమైన హాస్యంతో కూడిన ఈ గొప్ప నవలలో.. ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరి నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాదించి చివర్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఏం చేశాడన్నదే బారిస్టర్ పార్వతీశం కథ...

బారిష్టర్ పార్వతీశం

బారిష్టర్ పార్వతీశం

1940 లోనే ‘బారిష్టర్ పార్వతీశం' సినిమా వచ్చింది. నవల ఆధారంగానే తెలుగులో మొట్ట మొదటి హాస్యకథా చిత్రంగా తెరకెక్కిన ‘బారిష్టర్ పార్వతీశం' కు అప్పుడు హెచ్ఎమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. అందులో లంక సత్యం ప్రధాన పాత్ర పార్వతీశంగా నటిస్తే.. జి. వరలక్ష్మి ఆయన భార్యగా నటించింది. అయితే, అప్పట్లో ఈ సినిమా అనుకున్నంత ఆర్ధిక విజయం సాధించకపోయినా.. మొదటి తెలుగు హాస్యకథా సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

లంకా సత్యం

లంకా సత్యం

77 ఏళ్ల క్రితం లంకా సత్యం పోషించిన పాత్రలో.. వెంకటేష్ నటించడం అంటే కచ్చితంగా ఆకట్టుకునే విషయమే. అయితే.. అప్పట్లో బారిష్టర్ పార్వతీశం చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటి ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం.. ఇలాంటి పీరియాడిక్ మూవీస్ కి డిమాండ్ బాగానే ఉంటుంది. పైగా వెంకీ డిఫరెంట్ ఇమేజ్ కి ఈ పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు.

అభిమానులు

అభిమానులు

దానికి తోడు ఫన్ ని సమర్దవంతంగా పండించే పార్వతీశం లాంటి పాత్ర అయితే ఖచ్చితంగా వెంకటేష్ దున్నేస్తారనటంలో సందేహం లేదు. సీనియర్ హీరోలు చిరంజీవి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథపై మూవీని తీయనున్నాడని టాక్స్ నడుస్తుండగా, బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ గా మూవీ చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు వెంకటేష్ బారిష్టర్ పార్వతీశం నవలని సినిమా మలచనున్నాడు అనే సరికి అభిమానులు కాస్త ఆనందంగానే ఉన్నట్టున్నారు.

English summary
Venkatesh is the front-runner to reprise the title role in the adaptation of this classic novel Barrister Parvateesam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu