విక్టరీ వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు.. ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ సరసన ఆశ్రిత దగ్గుబాటి
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి.. దాని ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ సంస్త ఇన్స్‌టాగ్రామ్ రిచ్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారతీయులకు మూడు స్థానాలు లభించగా... తెలుగు మహిళ, సినీ నటుడు వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం విశేషంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021 వివరాల్లోకి వెళితే..

ఇన్స్‌టాగ్రామ్‌లో సెలబ్రిటీలు చేసే పోస్టులు
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న సెలబ్రిటీలు తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇతరులను ప్రభావితం చేయడం తెలిసిందే. అయితే లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన వారికి ఇన్స్‌టాగ్రామ్‌లో సెలబ్రెటీలు పోస్టు చేసే ఒక్కో పోస్టుకు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన జాబితాలో ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ టాప్ స్థానాల్లో నిలిచారు.

హాపర్ ఇన్స్‌టా రిచ్ లిస్టులో ఆశ్రిత దగ్గుబాటి
ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఆదాయాన్ని సొంతం చేసుకొంటున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూతురు కూడా ఉండటం విశేషంగా మారింది. ఆమె ఫుడ్ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆశ్రితాకు ఇన్స్‌టాగ్రామ్‌లో 136,359 ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే ప్రతీ పోస్టుకు 400 డాలర్లు చెల్లిస్తారు. అంటే ప్రతీ పోస్టుకు సుమారు 31 వేల రూపాయాలను ఇస్తారు.

ప్రపంచవ్యాప్తంగా 395వ స్థానం
హాపర్ సంస్థ రూపొందించి జాబితాలో అశ్రిత దగ్గుబాటి ప్రపంచవ్యాప్తంగా 377 స్థానాన్ని, ఆసియాలో 27వ స్థానాన్ని గెలుచుకొన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన జాబితలో ఆశ్రిత ఉండటాన్ని దగ్గుబాటి అభిమానులు స్వాగతించారు. ఆశ్రిత సాధించిన ఘనత తెలుగు మీడియాలో చర్చనీయాంశమైంది.

ఫుడ్ వ్యాపార రంగంలోకి
ఆశ్రిత దగ్గుబాటి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వరంగల్ మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆశ్రిత బార్సిలోనాలో ఉంటున్నారు. బేకరీ, ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్న ఆశ్రితకు ఇన్స్‌టాగ్రామ్‌లో 137000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను తయారు చేసే వంటకాలు, బేకరీ ఐటెమ్స్‌కు ఇన్స్‌టాగ్రామ్‌లో మంచి స్పందన లభిస్తున్నది.

ఇన్‌ఫినిటీ ప్లాటర్ అనే బ్రాండ్‌తో
ఆశ్రిత దగ్గుబాటి ఇన్‌ఫినిటీ ప్లాటర్ అనే బ్రాండ్‌తో ఫుడ్ వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు. మేలైన, మెరుగైన ఆహారాన్ని అందించాలనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నారు. తన బేకిం్ టాలెంట్‌తో స్వయంగా ఎదుగుతూ ఎందరికో స్పూర్తిగా నిలిచేలా ఓ సెలబ్రిటీగా మారారు.


Click it and Unblock the Notifications











