»   » అసలు ఏమయ్యింది... ఒక్క వెంకీ ఎందుకింత వెనకబడ్డాడు ?

అసలు ఏమయ్యింది... ఒక్క వెంకీ ఎందుకింత వెనకబడ్డాడు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ ది ఒక ప్రత్యేక పంథా అటు ఫ్యామిలీ హీరో అనిపించుకుంటూనే మరోపక్క మాస్ ఇమేజ్ నికూడా నిలబెట్టుకుంటూ వరుస సినిమాలు తీస్తూ వచ్చిన హీరో. స్టార్ రేసులో ఎటువంటి పోటీ లేకుండా ఏ కాంట్ర వర్సీల జోలికీ పోకుండా సైలెంట్ గా తనపని తాను చేసుకు పోతూ ఉంటాడు. అయితే మొన్నటి వరకూ వరుసగా సినిమాలు తీస్తూ వచ్చిన వెంకీ ఈ మధ్య మరీ స్లో అయిపోయాడు. పదేళ్ళ్ గ్యాప్ తర్వాత వచ్చిన చిరంజీవి కూడా మళ్ళీ వరుసగా ఆఫర్లతో బిజీ అయిపోతూంటే వెంకీ మాత్రం ఇంకా తీరిగ్గా ఒక్కొక్క సినిమా ఎంచుకుంటూ, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ తడబడుతున్నాడు...

Victory Venkatesh Movie After Guru

ఒక దశలో ఒకే సంవత్సరం లో రెండు సినిమాలు తీసి న ఈ హీరో ఇప్పుడు మరీ స్లో అయిపోయాడు. విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాను పూర్తి చేసి మూడు నెలలవుతోంది. కానీ ఆయన తర్వాతి సినిమా దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 'గురు' సెట్స్ మీద ఉండగానే వెంకీ.. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమాకు కమిటయ్యాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతలో పూరి జగన్నాథ్‌ తో సినిమా ఒకే అయిపోయినట్టే అన్నారు

ఒక టైంలో వెంకీ-పూరి కాంబినేషన్లో సినిమా పక్కా అంటే పక్కా అన్నారు. ఇందుకోసం వెంకీనే స్వయంగా బడ్జెట్ కూడా సమకూరుస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. పూరి బాలయ్య వైపు వెళ్లిపోయాడు. చివరికి 'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శకుడు క్రిష్.. వెంకీ కోసం ఓ కథతో వచ్చాడు. కానీ దాని మూల కథకు సంబంధించిన నవల హక్కులు దొరక్కపోవడంతో క్రిష్ వెనక్కి తగ్గాడు.

Victory Venkatesh Movie After Guru

ఇక ఇప్పుడు వెంకీ కి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు.. దాదాపు ఇప్పుడు దర్శకులంతా బిజీ బిజీ, దానికి తోడు కొత్త హీరోల హవాకూడా మొదలయ్యింది. ఇలాంటి సమయం లో ఇంత సైలెంట్ అయిపోవటం ప్రమాదకరం కూడా. మరి మన ఎంకన్న బాబు ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆలోచిస్తాడో ఏమో....

English summary
Victory Venkatesh Who is getting Ready to Hit the screans shortly is became verry slow, now the Tollywood Topic is with whom Venky going To be Team up
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu