»   » రైతులు ఆత్మహత్యలను వెటకారం చేస్తే ఆస్కార్ కా?

రైతులు ఆత్మహత్యలను వెటకారం చేస్తే ఆస్కార్ కా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పిప్లీలైవ్‌' ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలోంచి తప్పించాలంటూ ఓ వివాదం మొదలైంది. 'పిప్లీలైవ్‌' సినిమాను నిషేధించాల్సిందిగా ఆ మధ్య కోరిన విదర్భ జనాందోళన్‌ సమితి ఈ సారి కూడా ఈ ఆందోళన చేపట్టింది. బ్లాక్ కామిడీ గా చెప్తూ రూపొందించిన ఈ చిత్రం రైతులు ఆత్మహత్యలను వెటకారం చేస్తూందని వారు దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరినీ ఈ చిత్రం అవమానించిట్లవతోందని వారు గొడవకు దిగుతున్నారు. అలాగే రుణమాఫీ కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడమేకాకుండా రైతుల ఆత్మహత్యల అంశం అంత తీవ్రమైనది కాదన్న రీతిలో చిత్ర కథ సాగిందని సమితి అధ్యక్షుడు కిషోర్‌ తివారీ ఆరోపించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అంబికాశోనీ కి ఓ లేఖ రాశామని అన్నారు. ఆ లేఖలో పీప్లీ లైవ్ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కాన్సిల్ చేయాలని కోరారు..ఇక ఈ చిత్రంలో రఘుబీర్‌ యాదవ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మలైకా షెనాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu