»   » బాలయ్య గుర్రం స్వారీ.. (వీడియో), దేవిశ్రీ,నయన్ సీన్ లోకి,ఇంకా..

బాలయ్య గుర్రం స్వారీ.. (వీడియో), దేవిశ్రీ,నయన్ సీన్ లోకి,ఇంకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్వరలో బాలయ్య తన వందో సినిమాలో గుర్రం ఎక్కి యుద్దాలు చేస్తాడని విన్నాం. ఈ లోగానే ఆయన గుర్రం ఎక్కి స్వారీ చేసి జనాల్లోకి వచ్చేసారు. తెనాలిలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఎడ్ల పందాలను బాలయ్య ప్రారంభించారు.

కాగడాతో జ్యోతిని వెలిగించి బాలయ్య ఎడ్ల పందాలను ప్రారంభించారు. అనంతరం గుర్రపు స్వారీ చేసి అభిమానులను అలరించారు. బాలయ్య గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన అభిమానులు గుర్రం వెంట పరుగులు పెడుతూ కేరింతలు కొట్టారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా డిక్టేటర్ రిలిజ్ అయ్యి... రెండు నెలలు దాటింది. కానీ ఇంతవరకు ఆయన తర్వాతి సినిమా మీద జనాలకు అధికారింకంగా క్లారిటీ లేదు. అందులోనూ ఆయన చేయబోయేది తన వందో సినిమా కావడంతో దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

గత రెండు నెలల్లో బాలయ్య వంద సినిమా అంటూ రకరకాల ప్రాజెక్టులు తెరమీదికి వచ్చాయి.
చివరగా క్రిష్ దర్శకత్వంలో గౌతమపుత్ర శాతకర్ణి చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త రూమర్స్ ఏమీ లేవు. దీనిపై ఈ రోజో రేపో.. బాలయ్య నోటి వెంటే అధికారిక ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈలోగా వందో చిత్రం గురించి మరిన్ని అప్ డేట్స్...

ప్రీ ప్రొడక్షన్

ప్రీ ప్రొడక్షన్

బాలకృష్ణ వందో చిత్రానికి సంబంధించి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.

హీరోయిన్ గా ..

హీరోయిన్ గా ..

ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నయనతారని ఎంచుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై చిత్ర యూనిట్ నయనతో సంప్రదింపులు కూడా మొదలెట్టిందని సమాచారం.

దేవిశ్రీప్రసాద్

దేవిశ్రీప్రసాద్

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దేవితో క్రిష్, బాలయ్య మాట్లాడినట్లు తెలుస్తోంది. గతంలో లెజండ్ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించారు.

సినిమాటోగ్రఫీ

సినిమాటోగ్రఫీ

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని .. వి.ఎస్ .జ్ఞాన శేఖర్ అందించనున్నారు.

రాజమాతగా

రాజమాతగా

ఈ సినిమాలో రాజమాత పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. రాజమాతగా హేమ మాలిని ఓ ఆప్షన్ అంటున్నారు. రమ్యకృష్ణని కూడా పరిశీలనలో ఉంది.

ఉగాది రోజే..

ఉగాది రోజే..

ఈ ఉగాదికి బాలయ్య వందో చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

లాంఛనంగా

లాంఛనంగా

ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు.

రెగ్యులర్ షూటింగ్

రెగ్యులర్ షూటింగ్

మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతారు. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తారు.

గ్రాఫిక్స్ కు

గ్రాఫిక్స్ కు

ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు బాగా ప్రయారిటీ ఉందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభం తో పాటే గ్రాఫిక్ వర్క్ కూడా ప్రారంభిస్తారు.

టైటిల్ ..

టైటిల్ ..

ముందుగా ఈ సినిమాకు గౌతమీపుత్ర శాతకర్ణి అనే టైటిల్ పెట్టాలని భావించినా, ఆ టైటిల్ పలకటం అంత సులువుగా లేదని యోధుడు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట.

 ఎప్పటి కథ

ఎప్పటి కథ

రెండో శతాబ్దంలో అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎందుకు ప్రయారిటీ

ఎందుకు ప్రయారిటీ

బాలయ్య ఈ చిత్రం చేయటం వెనక, ఆంద్రుల రాజధాని అమరావతి గురించి చెప్పాలన్న కోరికే అంటున్నారు.

రీసెర్చ్ వర్క్

రీసెర్చ్ వర్క్

అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచీ దర్శకుడు క్రిష్.. ఈ చిత్రానికి సంభందించిన రీసెర్చ్ వర్క్ చేస్తున్నాడని సమాచారం.

నిర్మాతలు

నిర్మాతలు

ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

బడ్జెట్ ఎంతో

బడ్జెట్ ఎంతో

అంతేకాదు ఈ సినిమాను దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రిస్క్ అంటున్నారు

రిస్క్ అంటున్నారు

బాలకృష్ణ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన లెజెండ్ లాంగ్ రన్ లో 38 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో బాలయ్య పై 80 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ అంటున్నారు ట్రేడ్ లో .

ట్రైనింగ్..

ట్రైనింగ్..

చారిత్రక నేపథ్యంలో సాగే కథ కావడంతో హీరో గుర్రపు స్వారీ చేయాల్సి ఉంటుందట. ముఖ్యంగా యుద్ద సన్నివేశాలు కోసం.. హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడట నందమూరి హీరో.

తెలిసిన విద్యే

తెలిసిన విద్యే

ఈ వయసులో గుర్రపు స్వారీ నేర్చుకోవటం అంటే చిన్న విషయం కాదు. ఐతే లెజెండ్ సినిమాలో బాలయ్య గుర్రం రావటం, అంతుకు ముందుకూడా ఆయన గుర్రపు స్వారీ చేయటం చేసారు. అయితే మరింత నైపుణ్యం కోసం ఆయన కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

కంచె చూసి

కంచె చూసి

బాలకృష్ణ ఈ సినిమా ఓకే చేసే ముందు క్రిష్ డైరక్ట్ చేసిన కంచె చిత్రం ప్రత్యేకంగా చూడటం జరిగిందని సమాచారం.

అవార్డ్ రావటం

అవార్డ్ రావటం

ఈ సినిమా ఓకే చేసిన తర్వాత కంచె చిత్రానికి జాతీయ అవార్డ్ లలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ రావటం కూడా ఆయనకు ఈ గౌతమి పుత్ర శాతకర్ణి ప్రాజెక్టుపై పూర్తి నమ్మకం కలిగేలా చేసిందని వినికిడి.

English summary
Devi Sri prasad has been roped in by the director Krish for this movie which is based on the life of Gauthamiputra Satakarni, a Satavahana ruler. 'Yodhudu' is the title under consideration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu