»   » ఫన్ టైమ్ :చిన్నపిల్లలా మారి మంచు లక్ష్మి అల్లరి (వీడియో)

ఫన్ టైమ్ :చిన్నపిల్లలా మారి మంచు లక్ష్మి అల్లరి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మీ ప్రసన్న...తన కుమార్తెతో కలిసి మరీ అల్లరి చేస్తున్నట్లుంది. ఆమె కూతురు పుట్టినదగ్గర నుంచి మరిత ఉషారుగా మారిపోయింది. రీసెంట్ గా ఆమె తన కుమార్తె విద్య నిర్వాణకు బొమ్మలు కొనటం కోసం చెన్నైలోని కిడ్స్ షాపింగ్ కి వెళ్లింది. అక్కడ ఉన్న ట్రాలీ స్మూత్ రన్ ఉందో లేదో చెక్ చేయటానికి ఇదిగో ఇలా దానిమీద కూర్చుని ...ఏం చేసిందో ఈ క్రింద వీడియోలో చూడండి.


ఈ వీడియోని ఆమె సోదరుడు మంచు విష్ణు షూట్ చేసి అప్ లోడ్ చేసాడు. ఇక్కడ షాపుల్లో ఆమె తన కుమార్తెకు, తన మేనకోడళ్లు విరియానా, అరియానాలకు షాపింగ్ చేసారు. మంచు మనోజ్ వివాహానికి ముందే ఈ షాపింగ్ చేసి తన పిల్లలను మొదట సంతోషపెట్టాలనుకుంటున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మంచు లక్ష్మి చిత్రాల విషయానికి వస్తే...


Video: Lakshmi Manchu turns a kid...Recreating Childhood Memories

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.


కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.


క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

English summary
Lakhsmi Manchu is busy shopping for her daughter Vidya Nirvana. She happy sharing this fun video with you all. It was good time, recreating childhood memories like this. She said... Thanks to my lovely brother Vishnu for capturing this fun time. Stay tuned for more interesting videos.
Please Wait while comments are loading...