»   » వీడియో : చిరంజీవి గెస్ట్ రోల్ ‘బ్రూస్ లీ'

వీడియో : చిరంజీవి గెస్ట్ రోల్ ‘బ్రూస్ లీ'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ' లో చిరంజీవి గెస్ట్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి వచ్చి హీరోయిన్ ని రక్షించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కు అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సీన్స్ కు సంభందించిన మేకింగ్ వీడియో ని ఇక్కడ చూడండి.

video: Megastar Chiranjeevi Cameo Making Video Out..

చిత్రం కథేమిటంటే...


అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు.


ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Team Bruce Lee The fighter released the sensational cameo making video of Megastar. In this cameo making video, Megastar’s stunning entry from the chopper would definitely blew the brains. Chiranjeevi was terrific and reminding his golden era’s Gang Leader.
Please Wait while comments are loading...