»   » వీడియో: రామ్ చరణ్, బన్ని,చిరు .. 'గ్యాంగ్ లీడర్' సాంగ్ కు స్టెప్స్

వీడియో: రామ్ చరణ్, బన్ని,చిరు .. 'గ్యాంగ్ లీడర్' సాంగ్ కు స్టెప్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన రెండో కుమార్తె శ్రీజ సంగీత్‌లో స్వయంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. వధూవరులు శ్రీజ, కల్యాణ్‌ కూడా సంగీత్‌లో ఆడిపాడారు. గ్యాంగ్ లీడర్ సాంగ్ కు మెగా హీరోలు చేసిన డాన్స్ వీడియోని ఇక్కడ చూడండి.

bunny and charan kummaru ammaPosted by Team RamCharan on 29 March 2016

అలాగే...చిరంజీవి తాను నటించిన 'రాక్షసుడు' చిత్రంలోని మళ్లీ మళ్లీ ఇది రానిరోజు.. పాటకు చిరు చిందేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లి అట్టహాసంగా ముగిసింది.అయితే ఆ వివాహ వేడుకలో జరిగిన మధుర స్మృతులు ఇప్పుడిప్పుడే అభిమానులను చేరి అలరింపచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వివాహంలో సంగీత్ పంక్షన్ అదిరిపోయింది. ఈ పంక్షన్ లో చిరంజీవి, ఆయన కుటుంబం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం వైభవంగా జరిగింది. 28 వ తేదీ ఉదయం 9:13 నిమిషాలకు బెంగుళూరు లోని చిరు ఫామ్ హౌస్ లో జరిగింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్ తో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది.

నవ దంపతులతో చిరు ఫ్యామిలీ మొత్తం...

Exclusive Pic From #SrijaKalyanamRamcharan 󾌧󾌧󾬐

Posted by Team RamCharan on 29 March 2016

అయితే ఈ పెళ్లి చిరంజీవి కుటుంబ సభ్యులు,చిరు ఆత్మీయులు మాత్రమే ఈ వివాహనికి హాజరయ్యారని సమాచారం.మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుంది.

English summary
A bit video of Chiranjeevi dancing to 'Gang Leader' song along with Mega Hero's, is now making rounds on the internet. Here it is for you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu