»   » పవన్ ఇలా చెప్పేస్తాడని ఎవరూ ఊహించలేదు: అంతటా ఆశ్చర్యం (వీడియోలు)

పవన్ ఇలా చెప్పేస్తాడని ఎవరూ ఊహించలేదు: అంతటా ఆశ్చర్యం (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేనంతగా తన గురించి మీడియాతో మాట్లాడారు. దాదాపు అన్ని ఛానెల్స్ కు కాదనుకుండా ఇంటర్వూలు ఇస్తూనే ఉన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత ఇచ్చిన ఈ ఇంటర్వూలలో తన మనస్సులోని మాటలను పూర్తిగా బయిటపెట్టారనటంతో సందేహం లేదు.

  పేరుకు తన సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ అన్నమాటే కానీ, సినిమా గురించి మాట్లాడింది అతి తక్కువ. ఎక్కవగా తన వ్యక్తిగతం, వ్యక్తిత్వం ప్రతిబింబేలా మాట్లాడారు. ఆయన అంత ఓపెన్ గా మాట్లాడటం మిగతా హీరోలకు నోట మాట రాని పరిస్దితి. ఎందుకంటే నాకు తెల్ల జుట్టు ఉంది, రంగేసుకుంటున్నా అని మొహమాటం లేకుండా చెప్పే హీరో ఎవరు ఉన్నారు మన తెలుగులో . ఎన్నో విషయాలు వేరే హీరోల నోటి నుంచి వింటామని కలలో కూడా ఊహించం.


  కేవలం టాప్ ఛానెల్స్ కు మాత్రమే కాకుండా ఇంటర్వూలు , చాలా తక్కువ పాపులారిటి ఉన్న ఛానెల్స్ ను సైతం ఆయన పట్టించుకోవటం మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఆయన తన ఇంటివద్దే వరస పెట్టి ఇంటర్వూలు ఇచ్చారు. ప్రింట్, డిజిటల్ మీడియాకు సైతం ఆయన ఇంటర్వూలు ఇచ్చి ఆశ్చర్య పరిచారు.


  వరస పెట్టి ఇంటర్వూలు ఇచ్చాం కదా అని చెప్పిన విషయమే పదే పదే చెప్పలేదు. ప్రతీ ఇంటర్వూలోనూ ఏదో ఒక కొత్త విషయం దొరుకుతూనే ఉంది. అభిమానులు ఈ ఇంటర్వూలను అన్నిటినీ పదిలింగా దాచుకోదలుస్తారు. అందుకే మేం మీకు గిప్ట్ గా వీటిన్నటిని ఒక చోట అందిస్తున్నాం.


  వెబ్ ఇంటర్వూ

  పవన్ కళ్యాణ్ ...ఐడియల్ బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో రెడ్ టవల్ ఎందుకు వాడారో చెప్పుకొచ్చారు. ఆయనకు తన చిన్నతనం నుంచే తన మెడ చుట్టూ ఆ టవల్ ని కట్టుకోవటం అలవాటు ఉండేదట. తన ఇంట్లో దాన్ని తెగవాడేవారట. ఎందుకు వాడేవారో ఇక్కడ చూడండి..మరి.

  Courtesy: Idlebrain


  ఈనాడు

  ఈనాడు

  ఈ ఇంటర్వూలో పవన్ ..తన భార్య అన్నా గురించి ప్రస్దావించారు. ఆమె వయిలెన్ ప్లేయర్ అని, లింగ్విస్టిక్ కోర్స్ చదివిందని చెప్పుకొచ్చారు. తనకు, తన పిల్లలకు మధ్య లాంగ్వేజ్ గ్యాప్ ఉండటం తనను భాధిస్తోందని చెప్పారు. అలాగే... అకీరా తో తను తెలుగు మాట్లాడినా ఆధ్యతో మాత్రం బ్రోకెన్ మరాఠి మాట్లాడతా అన్నారు. మరో కుమార్తె పోలెనాతో ...ఇంగ్లీష్ మాట్లాడతా అని చెప్పారు.


  రాజీవ్ మసంత్

  ఇప్పటివరకూ బాహుబలి చిత్రం చూడలేదని చెప్పి షాక్ ఇచ్చారు. మహేష్ బాబు తో తనకున్న అనుబంధం గురించి ప్రస్దావించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.


  ఎన్ టివీ

  తన పొలిటికల్ ప్లాన్స్ గురించి, తను ఫైనాన్సియల్ స్ట్రగుల్ పడుతున్నానని, తన స్టాఫ్ కు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు.
  Courtesy: NTV


  ఎబిన్ ఆధ్రజ్యోతి

  తన కుమారుడు ఏం చదువుతున్నాడో కూడా తనకు తెలియదని అన్నారు. అకీరా పుట్టిన రోజున తాను విష్ కూడా చేయలేదని అన్నారు. అది అకీరా కు కోపం తెప్పించిందని చెప్పారు.
  Courtesy: ABN


  TV9

  రామ్ గోపాల్ వర్మ కంటిన్యూ ట్వీట్ల గురించి మాట్లాడారు. ఆయన చాలా ప్రస్టేషన్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
  Courtesy: TV9


  V6

  పొలిటికల్ ప్లాన్స్ గురించి పవన్ ఇక్కడ మాట్లాడారు. అలాగే 2019లో ఖచ్చితంగా ఎలక్షన్స్ లో నిలబడతాను అన్నారు.

  Courtesy: V6


  TV5

  సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం హిందీలో ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నారో చెప్పారు. అలాగే తెలుగు మార్కెట్ ని పెంచాలనకుంటున్నట్లు తెలియచేసారు. క్వాలిటీ డబ్బింగ్ తో హిందీ ప్రేక్షకులకు మంచి ఎక్సపీరియన్స్ ఇచ్చారమని చెప్పారు.

  Courtesy: TV5


  T News

  చిరంజీవి తో తనకున్న రిలేషన్, డ్రమ్ రోల్స్ , ఇంకా మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు ముచ్చటించారు.

  Courtesy: T News.


  English summary
  Pawan Kalyan has spoken a lot in his latest interviews, which were given post the release of Sardaar Gabbar Singh. But, each of his interview revealed a new thing about his lifestyle and thinking in general, which is why they have become special for his fans.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more