twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి సావిత్రి బయోపిక్ ఆగిపోయినట్టేనా?? విధ్యా బాలన్ తల్చుకుంటే ఓకే కానీ....

    |

    తెలుగు తెర మీద చెరిగిపోని ముద్ర వేసిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాకు 'మహానటి' అని టైటిల్ పెట్టారట.బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. దంగల్, ధోని, సచిన్, కిషోర్ కుమార్,సంజయ్ దత్, రాణి లక్ష్మీ భాయ్ వంటివన్నో తెరకెక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు దర్శకులు కూడా బాలీవుడ్ బాటలోనే బయో పిక్ లకే ఓటేస్తున్నారు. అందులో మొదటిగా 'మహానటి' అని పిలిపించుకొన్న సావిత్రి జీవిత చరిత్ర తెరకెక్కుతోంది.

    అల్లుడితో ఓ భారీ సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో దర్శ‌కుడిగా నిరూపించుకొన్న నాగ అశ్విన్‌... అశ్వ‌నీద‌త్ మామా అల్లుళ్ల‌న్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ రెండో ప్రాజెక్టు కోసం నెల రోజులుగా సుదీర్ఘ‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ తయారు చేసుకున్నాడట నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే సినిమా అంటే కేవలం ఏంటర్టైన్ మాత్రమే కాదు దానితో ఏదో ఒక మెసేజ్ కూడా ఇవ్వొచ్చు అన్న విషయాన్ని తెలిపాడు.

    ఈ కాలపు హీరోయిన్లలో సావిత్రి పాత్రని పోషించే సత్తా ఎవరికి ఉందా అన్న కోణం లో గాలించిన అశ్విన్ విధ్యా బాలన్ అయితే సరిగ్గా సరిపోతుందన్న అభిప్రాయానికి వచ్చాడట. అసలైతే సౌత్లో లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే అనుష్క మొదటగా గుర్తోస్తుంది అయితే సావిత్రి గారిలా కనిపించటం అంటే అనుష్క తో అవదు. అనుష్కలో సావిత్రిని ఊహించుకోవటం కష్టమే. ఇక అనుష్కని పక్కన పెట్టి చూస్తే బాలీవుడ్ లో విద్యా బాలన్ మాత్రం అందరికి మొదటి ఆప్షన్ అవుతుంది. కానీ విధ్యా మాత్రం ఈ సినిమా చేయటానికి కొండెక్కి కూచుందట.... ఇంతకీ విధ్యా మేడం ప్రాబ్లం ఏమిటీ..? సినిమా గురించిన ఇతర విశేషాలు స్లైడ్ షో లో...

     బయో పిక్

    బయో పిక్

    ఇప్పుడు ఎక్కడ చూసినా బయో పిక్ ట్రెంద్ నడుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు బయో పిక్ ల సీజన్ నడుస్తోంది. పొలిటీషియన్లు, సినిమా తారలు, క్రికెటర్ల జీవితాలను ఆధారంగా చేసుకొని సినిమా తీయడమనే ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పుడు టాలీవూడ్ కూడా అదే బాటలో నడుస్తోంది.

    సావిత్రి

    సావిత్రి

    మొదటి ప్రయత్నమే మహానటి సావిత్రి గారి బయో పిక్ అన్న ఆలోచనతో మొదలయ్యింది. ఒక నాటి తెలుగు చిత్ర సీమ కే మహారాణి లాంటి సావిత్రి గారి జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి.ఆ సినిమాకు 'మహానటి' అని టైటిల్ పెట్టారట.

     నాగ అశ్విన్‌

    నాగ అశ్విన్‌

    ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో దర్శ‌కుడిగా నిరూపించుకొన్న నాగ అశ్విన్‌... అశ్వ‌నీద‌త్ మామా అల్లుళ్ల‌న్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ రెండో ప్రాజెక్టు కోసం నెల రోజులుగా సుదీర్ఘ‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ తయారు చేసుకున్నాడట నాగ్ అశ్విన్.

    సీరియస్ ధోరణిలో

    సీరియస్ ధోరణిలో

    ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ, దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌లా ఈ సినిమా ఉండేలా నాగ అశ్విన్ స్క్రిప్ట్‌ను వర్కవుట్ చేశారు.

    సావిత్రి గారి

    సావిత్రి గారి

    అయితే అసలు సావిత్రి గారి జీవితం లోని విషాదాన్ని టచ్ చేయకుండా ఈ సినిమాని తీసేటట్టయితే అసలా సినిమా అసంపూర్ణమే కదా అనే విమర్శలు వినిపించినా తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్ పక్కా గా ఉందని తనకు తనమీద నమ్మకం ఉందనీ చెప్తున్నాడట అశ్విన్.

    పెద్ద బ్యానర్ నిర్మిస్తుందట

    పెద్ద బ్యానర్ నిర్మిస్తుందట

    అంతేకాదు ఈ సినిమాను ఓ పెద్ద బ్యానర్ నిర్మిస్తుందట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. బయోపిక్ లకు సూపర్ క్రేజ్ ఉన్న ఈ సమయంలో సావిత్రి జీవిత కథను తెర మీదకు తీసుకు రావాలన్న ఆలోచన చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతటి ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందో చూడాలి.

    సావిత్రి పాత్ర

    సావిత్రి పాత్ర

    సావిత్రి పాత్ర కోసం చాలామంది పేర్లు ప‌రిశీలించారు. ఈ సినిమాని బాలీవుడ్‌స్థాయిలో తీయాల‌న్న‌ది అశ్వ‌నీద‌త్ ప్లాన్‌. అందుకే అక్క‌డి నుంచి క‌థానాయిక‌ల్ని దిగుమ‌తి చేయాల‌ని చూస్తున్నారు. సావిత్రిగా మొద‌టి ఆప్ష‌న్‌.. విద్యాబాల‌న్‌. సావిత్రి స్టేచ‌ర్‌కి, సావిత్రి రూపానికి విద్యాబాల‌న్ అయితే స‌రిపోతుంద‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నార‌ట‌. విద్య ఓకే అంటే ఈసినిమాకి బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వ‌స్తుంద‌ని, మార్కెట్ కూడా బాగా జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం.

    విద్యాబాల‌న్

    విద్యాబాల‌న్

    అయితే విద్యాబాల‌న్ మాత్రం రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దాంతో పాటు షూటింగ్ ఎక్క‌డ చేయాలి? అనే విష‌యాల‌పైనా కొన్ని సూచ‌న‌లు చేసింద‌ట‌. ఆమె డిమాండ్ల లిస్టు పెద్ద‌దే ఉంద‌ని టాక్‌. అయినా స‌రే..

    విద్యాబాల‌న్‌తోనే

    విద్యాబాల‌న్‌తోనే

    ఈ సినిమాని విద్యాబాల‌న్‌తోనే తెర‌కెక్కించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ని స‌మాచారం. కానీ ఆమె అడిగే మొత్తం ఇవ్వటం కన్నా కొన్నాళ్ళు ఆగటమే మంచిదనే ఆలోచనలో కూడా ఉన్నారట. రెండు మూడు వారాల్లో సావిత్రికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వైజ‌యంతీ మూవీస్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి వెలువ‌డే అవ‌కాశం ఉంది.

    సినీ తారల

    సినీ తారల

    సినీ తారల మీద బయో పిక్ అనగానే గుర్తొచ్చే సినిమా "డర్టీ పిక్చర్", ఒక రకంగా విధ్యా బాలన్ నటనా విశ్వరూపాన్ని బయట పెట్టిన సినిమా అది. అదె స్థాయి నటనా, సావిత్రి గారిని అక్షరాలా అనుకరించగలిగే టాలెంట్ విధ్యాలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈవిడగారేమో నాలుగు కోట్లంటూ కొండమీద కూచుంది. మరి ఆఖరికి ఏమవుతుందో చూడాలి మరి.

    English summary
    Bollywood Hot Beauty Vidya balan demand 4 crores for Senior Actress savitri biopic movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X