»   » ఎంత చేసినా సెక్సప్పీల్ కనపడటం లేదు...

ఎంత చేసినా సెక్సప్పీల్ కనపడటం లేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నటితరం వెండితెర సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి విదితమే. సిల్క్ స్మితకి టాలీవుడ్, బాలీవుడ్..అన్న తేడాలేకుండా దేశవ్యాప్తంగా వున్న పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో ఆమె పాత్రలో ఒదిగిపోయే అవకాశం వచ్చినందుకు ఎగిరి గంతేసింది బాలీవుడ్ భామ విద్యాబాలన్. ఎగిరి గంగేయడమే కాదు, సిల్క్ స్మిత జీవిత విశేషాల్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ, రెగ్యులర్ గా ఆమె సినిమాలు చూస్తూ, సిల్క్ స్మిత హావభావాల్ని ఆకలింపు చేసుకునే పనిలో విద్యాబాలన్ బిజీ అయిపోయింది. మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం విద్యా బాలన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది. స్మిత పుట్టిపెరిగిన ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి, స్మిత పడిన కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోనుంది. ఇందుకోసం చెన్నై‌తో పాటు..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఆమె పర్యటించనుంది.

అంతేనా..సిల్క్ స్మితలా వంటిపై చాలీ చాలని బట్టలేసుకుని తన ఇంట్లోనే ఏకాంతంగా ఏకపాత్రాభినయం చేసేసుకుంటోందిట. అయితే, ఎంత చేసినా సిల్క్ స్మిత రేంజ్ లో సెక్సీప్పీల్ మాత్రం తనవల్ల కావడంలేదని వాపోతోందిప్పుడు విద్యాబాలన్. అయినాసరే, తనవంతుగా సిల్క్ స్మిత పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాననీ, సిల్క్ స్మితని మైండ్ లో పెట్టుకుని సినిమా చూడొద్దనీ, ఆ పాత్రలో తాను ఒదిగి పోయిన తీరును మాత్రమే గమనించాలని విద్యాబాలన్ వేడుకుంటోంది. ఇంకా సినిమా విడుదల కాకుండానే విద్యాబాలన్ చేతులెత్తేయడంపై బాలీవుడ్ జనం తమకు తోచిన విధంగా కామెంట్లు వేసుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu