»   » డర్టీ పిక్చర్ విద్యా బాలన్‌కు గౌరవ డాక్టరేట్...

డర్టీ పిక్చర్ విద్యా బాలన్‌కు గౌరవ డాక్టరేట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ ‘డర్టీ పిక్చర్'లో అద్భుతమైన నటనా కౌశలానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విద్యా బాలన్.... తాజాగా మరో గౌరవం అందుకున్నారు. విద్యా బాలన్ సినిమా పరిశ్రమలోకి వచ్చి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ గౌరవ డాక్టర్ రేట్ లభించడం విశేషం.

సినీ రంగానికి చేసిన సేవలు, మహిళా బలాన్ని చూపించే ప్రయత్నాలు చేయడం లాంటి కారణాలతో అహ్మదాబాద్ రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తనకు ఈ గౌరవం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యా బాలన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Vidya Balan Honored With Doctorate

విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె మోహిత్ సూరి దర్శకత్వంలో ‘హమారీ ఆధురి కహానీ' చిత్రంలో నటిస్తోంది. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మికి జోడీగా విద్యా బాలన్ నటిస్తోంది. మహేష్ భట్, ముఖేష్ భట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యా బాలన్, ఇమ్రాన్ మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు, శృంగార సన్నీవేశాలు, లిప్ లాక్ సీన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Vidya Balan, the power packed performer who won the prestigious National Award for The Dirty Picture, will be conferred with a Doctor of Arts Honoris Causa degree by one of the most popular private universities in India, Rai University of Ahmedabad, Gujarat.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu