»   » ఇంకా నాన్చుతున్న బాలీవుడ్ భామ.. 'ఎన్టీఆర్' విషయం తేల్చేదెప్పుడు!

ఇంకా నాన్చుతున్న బాలీవుడ్ భామ.. 'ఎన్టీఆర్' విషయం తేల్చేదెప్పుడు!

Subscribe to Filmibeat Telugu

స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్రని ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ రోల్ పోషించబోతున్నారు. ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో రూపొందించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరించాలని భావిస్తున్నారు. తారాగణం విషయంలో కూడా పెద్ద కసరత్తే జరుగుతోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని చిత్ర యూనిట్ సంప్రదించిన సంగతి తెలిసిందే. కానీ విద్యా బాలన్ ఇంత వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. గత ఏడాది కూడా విద్యాబాలన్ ఓ మలయాళీ చిత్రం చేస్తానని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. అదే టెన్షన్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలకు మొదలయిందని వార్తలు వస్తున్నాయి.

Vidya Balan keeps NTR waiting

కాగా నిర్మాతలు ఆమెని కలసినప్పుడు విద్యాబాలన్ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కథలో తనకు ఉన్న సన్నివేశాలు మొత్తం చిత్రీకరించాలని వేటిని తొలగించకూడదని కండిషన్ పెట్టిందట. ఏది ఏమైనా విద్యా బాలన్ బాలయ్యనే వెయిటింగ్ లో పెట్టిందంటే మామూలు విషయం కాదు.

English summary
Vidya Balan keeps NTR waiting. NTR biopic regular shoot will starts soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X