»   » మీ మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్‌ చేస్తున్నారు : విధ్యా బాలన్ చిరాకు పడింది

మీ మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్‌ చేస్తున్నారు : విధ్యా బాలన్ చిరాకు పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లు గ్లామరస్ గా కనిపిస్తూ తమ అందాలను ఆరబోస్తూ కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకుంటారు, కాని అందవిహీనంగా కనిపించే డీగ్లామరైజ్డ్ పాత్రలను చేయమంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ ముందుకు రాదు. కానీ దీనికి పూర్తి విరుద్దం విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్' హీరోయిన్ లా వెండి తెరపై తన అందాలన్నీ ఆరబోయ గలదు. అంతేకాదు అదే విధ్యాబలన్ తొమ్మిది నెలల నిండు గర్భిణిగా 'కహాని' సినిమాలో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరచ గలదు.

సినిమా స్క్రీన్ పై అత్యంత గ్లామరస్ గా కనిపించే విద్య చాలా హుందాగా కనిపిస్తుంది. అంతే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఏమాత్రం సంకోచం లేకుండా సూటిగానే మాట్లాడేస్తుంది. చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంది. ఎవరేమనుకుంటారోనని అలోచించకుండా మనసులో ఉన్నది చెప్పేస్తుంది. తాజాగా మీడియా తీరును ఎండగడుతూ తన మీద తనే జోకులేసుకుంది. ఆమె మీద వెలువడుతున్న గ్యాసిప్సే ఆమెను ఇలా మాట్లాడేలా చేశాయి.

Vidya Balan miffed on her pregnancy news

విద్యకు నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో వివాహమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకోనుందని గ్యాసిప్‌లు బయల్దేరాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు గ్యాసిప్‌ రాయుళ్లు. దీనిపై విద్య తనదైన స్టయిల్లో స్పందించింది.

'సిద్ధార్థ్‌తో నాకెలాంటి విభేదాలూ లేవు. మేమిద్దరం ఇప్పుడు కలిసే ఉన్నాం. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలీదు. నా ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్‌ చేస్తున్నారు. మొదట్లో ఇలాంటి వార్తలకు బాధపడేదాన్ని. ఇప్పుడు అవి అలవాటైపోయాయ'ని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఎంత భరించినా కొన్ని సార్లు చిరాకుని దాచుకోలేని స్తాయిలో పుకార్లు వస్తే విధా అనిఏమిటి ఎవ్వరైనా ఇలాగే రెస్పాండ్ అవుతారేమో..

English summary
Bollywood Star heroine Vidya Balan miffed on her pregnancy news and rumors on her married life with Siddartha roy kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu