»   »  హైదరాబాద్‌లో అడుక్కుతింటూ కనిపించిన హీరోయిన్!

హైదరాబాద్‌లో అడుక్కుతింటూ కనిపించిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్లంటే గ్లామర్‌కు ప్రతి రూపం. ఎంత ఘాటుగా అయినా అందాలు ఆరబోతకు సై అంటారు కానీ...డీగ్లామరస్ పాత్రలు చేయమంటే మాత్రం చాలా మంది ముందుక రారు. కానీ హీరోయిన్ విద్యాబాలన్ మాత్రం నటనకు ఆస్కారముండే ఎలాంటి పాత్ర అయినా చేస్తూ దూసుకెలుతోంది.

ప్రస్తుతం ఆమె 'బాబీ జాసోస్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. సమర్ సైఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో విద్యా బాలన్ షాకింగ్ లుక్‌తో కనిపించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆమె హైదరాబాద్ రైల్వేస్టేషన్లో మారువేశంలో అడుక్కుంటూ ఉన్న స్టిల్ ఒకటి తాజాగా విడుదలైంది.

Vidya Balan

వైవిద్యమైన పాత్రలు చేస్తూ పత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న విద్యా బాలన్ ఈ చిత్రంలో ప్రేక్షకులను తన భిన్నమైన నటన, రూపంతో ఆకట్టుకుంటుందని ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని దియా మీర్జా, సాహిల్ సంఘా సంయుక్తంగా బోర్న్ ఫ్రీ ఎంటర్టెన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.

సినిమా మొత్తం విద్యాబాలన్ చుట్టూ తిరిుగుతుంది. ఈ చిత్రంలో ఆమె లేడీ డిటెక్టివ్ పాత్రలో నటిస్తోంది. తన వృత్తిలో భాగంగా ఆమె వివిధ రకాల మారు వేషాల్లో తిరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఇలాంటి తరహా చిత్రం ఇదే మొదటి అంటున్నారు విశ్లేషకులు. అలీ ఫజల్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శంతను మోయిత్రా సంగీతం అందిస్తున్నారు.

English summary
Bobby Jasoos is an upcoming 2014 Indian action-thriller film directed by Samar Shaikh and produced by Dia Mirza and Sahil Sangha under the banner of Born Free Entertainment. It features Vidya Balan in the lead role. Vidya Balan will be playing the role of a lady-detective in this film, which is going to be the first of its kind in India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu