»   » ప్రెగ్నెన్సీ రూమర్లకు తెర దించిన విద్యా బాలన్

ప్రెగ్నెన్సీ రూమర్లకు తెర దించిన విద్యా బాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ గర్భవతి అయిందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిదేమీ లేదని ఆమె ప్రకటించినా.....తరచూ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడల్లా ఓ బలమైన కారణం కూడా వినిపిస్తుంటంతో అభిమానులు అయోమయంలో పడుతున్నారు.

ఇటీవల ఆమె మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే 'హమారి అధురి కహానీ' సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో....విద్యా బాలన్ గర్భం దాల్చడం వల్లనే ఆ సినిమా నుండి తప్పుకుందనే పుకార్లు షికార్లు చేసాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'హమారీ అధురీ కహానీ' చిత్రం చేయడంపై తనకు ఎంతో ఆసక్తి ఉందని, అయితే ఆరోగ్య సమస్యల వల్ల కొంత బ్రేక్ తీసుకున్నట్లు తెలిపారు.

Vidya Balan puts pregnancy rumours to rest

అనారోగ్యం కారణంగా విద్యా బాలన్ ఇటీవల అమెరికాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కాకూడదని అనుకుంది కానీ....కాస్త కోలు కోవడంతో చివరి నిమిషంలో ఆ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. తనకు ఇప్పుడప్పుడే గర్భం దాల్చే ఆలోచన లేదని విద్యా బాలన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

English summary
Vidya categorically stated that she is not ready for pregnancy yet as being responsible for another human life is a daunting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu