For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విద్యాబాలన్ పెళ్లిసందడి:18 చీరలు...14 కోట్ల ఇల్లు(ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా విద్యాబాలన్ వివాహానికి సంభందించిన కబుర్లే. రెండేళ్లుగా సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న విద్య బాలన్ శుక్రవారం ఉదయం ఆయన్ని పరిణయమాడబోతోంది. విద్యాబాలన్‌ ఇంట్లో సంగీత్‌ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. దీనికి ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు చిత్రసీమకు చెందిన అతి కొద్దిమంది హాజరవుతారని సమాచారం.

  ఈ వేడుకలో విద్య 'ఉ లా లా ఉ లా లా' (డర్టీ పిక్చర్‌) పాటకు నృత్యం చేస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు.కొద్ది వారాలుగా వధూవరులు పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులివి...

  ముంబయిలోని చెంబూర్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య సమాజ్‌ గుడిలో వారు ఒక్కటవ్వబోతున్నారు. వధూవరుల రెండు సంప్రదాయాల్లో వివాహం చేయబోతున్నారు. విద్యది మలయాళ బ్రాహ్మణ కుటుంబం. పంజాబీ కుటుంబానికి చెందినవారు సిద్ధార్థ్‌. వివాహాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని విద్య, సిద్ధార్థ్‌రాయ్‌లు నిర్ణయించుకొన్నారు.

  తన మిత్రుడు, ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీతో 18 చీరలు విద్య డిజైన్‌ చేయించుకుంది. అన్నీ దక్షిణాది వస్త్ర శైలిని ప్రతిబింబించేలా ఉన్నాయి. 18 చీరల్లో ఒకటి మద్రాసు పట్టు చీర. ఇందుకు అవసరమైన పట్టుని తమిళనాడు నుంచి తెప్పించారు. చీరలపై అలంకరణలు చేసే నిపుణులు ముఖర్జీ సూచనల ప్రకారం వాటిని తీర్చిదిద్దారు.

  సిద్ధార్థ్‌ తన కాబోయే భార్య కోసం విలువైన బహుమానాన్ని సిద్ధం చేశారు. ఇది ‘సీ ఫేసింగ్ బంగ్లా' , ఖరీదు 14 కోట్ల రూపాయలు. పెళ్లి తర్వాత విద్యా, సిద్దార్థ్ ఆ బంగ్లాలోనే తమ జీవన ప్రయాణం మొదలుపెడతారని వినికిడి. ముంబయిలోని జుహూ తారా రోడ్డులో ఈ ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు.

  ఈ పెళ్లిలో కుటుంబ సభ్యులతో పాటు అత్యంత ఆప్తమిత్రులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు. వివాహానికి పరిమిత సంఖ్యలోనే ఆహ్వానాలు ఇచ్చారు. అమితాబ్‌, ఏక్తా కపూర్‌ కుటుంబాలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఆర్‌.బాల్కీ, విశాల్‌ భరద్వాజ్‌, మిలన్‌ లూథ్రియా తదితరులనీ పెళ్లికి పిలిచారు. వివాహానంతర విందు చెన్నైలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలిసింది.

  విద్య ప్రస్తుతం ఇమ్రాన్‌హష్మి సరసన 'ఘన్‌ చక్కర్‌' అనే చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరింది. మూడు రోజులపాటు షూటింగ్‌కి హాజరయ్యే అవకాశాలున్నాయి.

  'ఘన్‌ చక్కర్‌' పూర్తయిన తరవాతే కొత్త జంట హనీమూన్‌కి కరీబియన్‌ దీవులకు వెళతారు. ఈ చిత్రానికి ఒక నిర్మాతగా సిద్దార్థ్‌రాయ్‌కపూర్ వ్యవహరిస్తున్నారు.

  English summary
  
 It is ringing wedding bells in Bollywood again! Vidya Balan and Siddharth Roy Kapur are ready to tie the knot and here are the elated and glowing couple at a private wedding bash organized for close family and friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X