»   » బిచ్చగాన్ని నమ్ముకుంటే 4 కోట్ల నష్టం.... బయ్యర్లకు కోట్ల నష్టాన్ని మిగిల్చిన భేతాళుడు

బిచ్చగాన్ని నమ్ముకుంటే 4 కోట్ల నష్టం.... బయ్యర్లకు కోట్ల నష్టాన్ని మిగిల్చిన భేతాళుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం ... సినిమా పరిశ్రమపై చాలా ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రిలీజ్ కావాల్సిన సినిమాలకు చాలా ఇబ్బంది ఎదురైంది. ఏరియావైజ్ సినిమా ని రిలీజ్ చేయటానికి...డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వాల్సిన పూర్తి డబ్బుని ఈ బ్లాక్ దెబ్బతో ఇవ్వటానికి సిద్దంగా కనపడటం లేదు. దానికి తోడు ధియోటర్స్ కు జనం రావటంలేదు. దాంతో చాలా ధియేటర్స్ లో షోలు కాన్సిల్ చేసారు. బిచ్చగ్గడు గా అందరి అంచనాలని తల్ల కిందులు చేసిన విజయ్ ఆంటోనీ... భేతాళుడుతో మాత్రం నిర్మాతల అంచనాలని తల్ల కిందులు చేసి షాకిచ్చాడు.

నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఈ సంవత్సరం 'బిచ్చగాడు' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభాలు ఈ సినిమాతో దక్కాయి. వాస్తవానికి తమిళ సినిమాలు తెలుగు లో డబ్ కావడం మామూలు విషయం.అయితే స్టార్ హీరోలవి తప్ప మిగతా సినిమాలు పెద్దగా కలెక్షన్లు సాధించవు. పెద్ద హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య సినిమాలు మంచి హిట్ సాధిస్తే కలెక్షన్లు బాగా వస్తాయి. అలాంటి వారికి పోటీ ఇస్తూ బిచ్చగాడు చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాడు విజయ్ ఆంటోని.


బిచ్చ‌గాడు అనంతరం విజ‌య్ ఆంటోని న‌టించిన భేతాళుడు కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, అటు కామ‌న్ జ‌నాల్లోనూ అత‌డి సినిమాపై ఒక‌టే క్యూరియాసిటీ. అనుకున్న‌ట్టే భేతాళుడు మూవీ దాదాపు 500 థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజైంది. డిసెంబ‌ర్ 1 రిలీజ్‌కి ముందే సైతాన్ హంట్స్ ఫ‌ర్ జ‌య‌ల‌క్ష్మి అంటూ యూనిట్ రిలీజ్ చేసిన వీడియో భేతాళుడిపై మ‌రింత ఆస‌క్తి రేకెత్తించింది. ఈ వీడియో దాదాపు 10 నిమిషాల నిడివితో ఉంది. .మార్నింగ్ షోతోనే పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.


Vijay Antony Bethaludu Buyers In Trouble

దీంతో విజయ్ ఆంటోనీ తదుపరి చిత్రానికి ఎక్కడా లేని పోటీ ఎదురయ్యింది దాంతో బయ్యర్లు పోటీపడి మరీ బేతాళుడు చిత్రాన్ని కొనుక్కున్నారు. అసలు కథ ఏమిటన్నది కూడా ఆలోచించకుండా "విజయ్ ఆంటోనీ" ఎంపిక మీద నమ్మకం తో కొనేసారు. అయితే సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్లో ఫ్లాప్ టాక్ వచ్చింది..దీంతో 3 కోట్ల షేర్ మాత్రమే వసూల్ కావడంతో 4 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు అయ్యింది దాంతో బేతాళుడు బయ్యర్లకు దిమ్మతిరిగింది. నిజానికి విజయ్ టేస్టు గొప్పదే కానీ అంతగొప్ప టేస్టు ప్రేక్షకుల రేంజిలో ఉండకపోవటం తో ఆయన టేస్ట్ కు తగ్గ సినిమాని నిర్మాతలనే చూసుకొమ్మని వదిలేసారు.


విడుదలకు ముందే బిచ్చగాడు ఊపులో 7 కోట్ల బిజినెస్ జరిగింది కానీ ఆ సినిమా కొనుక్కున్న వాళ్లకు పెద్ద మొత్తంలో నష్టం రావడంతో ఏం చేయాలో పాలుపోక దిగాలు పడ్డారు బయ్యర్లు. అయితే తమిళ డబ్బింగ్ సినిమాకు మూడు కోట్ల షేర్ రావడం కూడా నాట్ బ్యాడ్ అంటున్నారు. ఇది కూడా బిచ్చగాడు సినిమాపై వచ్చిన క్రేజ్ తో సంపాదించనవే. తప్ప సినిమా వల్ల వచ్చినవి కాదు అని టాక్.

English summary
Vijay Antony Latest Movie Bhetaaludu is a big loss for Buyers who blindly trusted on Bicchagadu results
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu