»   » విజయ్ ఆంటోని ‘యమన్‌’రిలీజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ టీజర్ చూసారా

విజయ్ ఆంటోని ‘యమన్‌’రిలీజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ టీజర్ చూసారా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :విజయ్ ఆంటోని హీరోగా లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవిందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం యమన్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి పోస్టర్ వదిలారు.

'రక్తానికి భయపడేవాడు రాజు కాడు.. రక్తపుమరక అంటకుండా రాజు కాలేడు' అంటున్నారు హీరో విజయ్‌ ఆంటోని పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఆంటోనీ రెండు పాత్రల్లో కనిపించే 'యమన్‌' చిత్రాన్ని మహాశివరాత్రికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విజయ్‌ ఆంటోని సమకూర్చారు.

Vijay Antony's 'Yaman' Slated For Maha Shivaratri Release

'బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు విజయ్‌ ఆంటోని. ఆ చిత్రం అమ్మ గొప్పదనాన్ని చాటి చెప్పింది. 'యమన్‌' నాన్న విలువ తెలియజెప్పే చిత్రం. ఓ పొలిటికల్‌ థ్రిల్లర్‌. అన్ని కమర్షియల్‌ హంగులూ ఉన్నాయి. విజయ్‌ ఆంటోని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రల్లో ఆయన చూపించిన వైవిధ్యం ఆకట్టుకొంటుంది.

వినాయక్‌ మాట్లాడుతూ ''తల్లి గొప్పతనం చాటిచెప్పిన 'బిచ్చగాడు' మంచి విజయాన్ని అందుకొంది. 'యమన్‌' తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రం. ఇది కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలి. కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తూ విజయ్‌ ఆంటోని మంచి విజయాల్ని అందుకొంటున్నారు. ఆయన నమ్మకం ఈ సినిమాతోనూ నిజం కావాల''ని ఆకాంక్షించారు.

విజయ్‌ చెబుతూ ''పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామా ఇది. రెండు పాత్రల్లో కనిపిస్తా. అన్ని రకాల కమర్షియల్‌ హంగులూ ఉన్నాయ''న్నారు.


ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, 'నకిలీ', 'డా సలీం', 'బిచ్చగాడు' వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం ఇదని, కథ, కథనాలు సరికొత్తగా సాగుతాయని, ఆయన అందించిన సంగీతంతోపాటు నటన కూడా హైలెట్‌గా వుంటుందని తెలిపారు. ఆడియోను విడుదల చేయనున్నామని, సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు.

English summary
Vijay Antony starrer “Yaman” will be released on the eve of Maha Shivaratri. Ravindar Reddy Miryala is producing the movie under the banners of Dwaraka Creations & Lyca Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu