»   » ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న య‌మ‌న్‌

ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న య‌మ‌న్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌స‌. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా...నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో మంచి చిత్రం 'యమన్‌'. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదో డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు.

కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్‌తో రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువగా లేవు. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్‌, సాంగ్స్‌ వుంటాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీలా 'యమన్‌' వుంటుంది. ఇప్పటివరకు విజయ్‌ ఆంటోని అంటే బిచ్చగాడు హీరోగానే అందరూ గుర్తించారు. ఈ సినిమా తర్వాత 'యమన్‌' హీరో అని కూడా పిలుస్తారు. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక పాట హీరోయిన్‌పై, మరో పాట లుంగి డాన్స్‌ టైప్‌లో, హీరో, హీరోయిన్‌పై ఒక సాంగ్ స‌హా మరో రెండు పాటలు స్టోరీతో వెళ్ళే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్ అన్నీ ఆడియెన్స్‌ను అల‌రిస్తున్నాయి.

vijay antony's yeman on 24th feb

ఈ పాటల్ని ఆల్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చి పెద్ద హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌వ‌రి 24న‌ రిలీజ్‌ చేస్తున్నాం. క‌చ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.

vijay antony's yeman on 24th feb

హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - "బిచ్చ‌గాడికి క‌థ ఎలా హీరో అయ్యిందో య‌మ‌న్ చిత్రానికి కూడా క‌థే హీరో. క‌థ విన‌గానే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. జీవ శంక‌ర్ సినిమాను ఎంతో చ‌క్క‌గా డీల్ చేశారు. ఇది అంద‌రికీ న‌చ్చే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. న‌టుడుగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నాకెంతో మంచి పేరు తెస్తుంది. తెలుగులో నేను చేసిన బిచ్చ‌గాడు కంటే పెద్ద హిట్ మూవీగా నిలుస్తుంది. సినిమాను ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.

vijay antony's yeman on 24th feb

విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ,స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.

English summary
Vijay Antony LatesT Movie "Yaman" makers have locked the release date of the movie on 24th February on the occasion of Maha Shivaratri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu