twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేపాల్ విషాదం: హైదరాబాద్ చేరుకున్న విజయ్ మృతదేహం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్‌ : : నేపాల్‌ భూకంపం దుర్ఘటనలో 'ఎటకారం' చిత్ర నృత్యదర్శకుడు, నటుడు కావిట్య విజయ్‌సింగ్‌(20) మృతి చెందిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనల ధాటికి ఎటకారం చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయ్ మృతదేహం బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లకు తరిలిస్తారు.

    గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో మార్కెట్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌సింగ్‌కు చిన్నతనం నుంచి నృత్యం అంటే చాలా ఇష్టం. సినీ నటుడు ప్రభుదేవాను స్ఫూర్తిగా తీసుకుని నృత్యాలు నేర్చుకొని గత ఐదారేళ్లుగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. 'ఎటకారం' సినిమాను విజయ్‌సింగ్‌ బాబాయ్‌ కిషన్‌ నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రానికి నృత్య దర్శకుడిగా పని చేసే అవకాశం లభించించడంతో ఈ నెల 20న చిత్రీకరణ కోసం చిత్ర బృందంతో కలిసివిజయ్‌ నేపాల్‌ వెళ్లాడు. శనివారం ఉదయం నేపాల్‌లో భూకంపం సంభవించగానే ఆందోళనకు గురైన తల్లితండ్రులు విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సిగ్నల్‌ అందకపోవడంతో మాట్లాడలేకపోయారు. హైదరాబాద్‌లో ఉన్న సినిమా నిర్మాతకి ఫోన్‌ చేయగా అందరు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. కుమారుడు క్షేమంగా ఉన్నారని తల్లిదండ్రులు వూపిరి పీల్చుకున్నారు.

    Vijay dead body reach Hyderabad Today

    ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కాఠ్‌మాండు నుంచి విజయ్‌ మాట్లాడాడు... బయపడవద్దని వచ్చేస్తున్నానని ధైర్యం చెప్పాడు. తర్వాత పలుమార్లు విజయ్‌ ఫోన్‌ కలవలేదు. సోమవారం తెల్లవారుజామున దిల్లీకి బయలు దేరిన సమయంలో వచ్చిన భూప్రకంపనలకు చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విజయ్‌సింగ్‌ చనిపోయినట్లు బాపట్లలో ఉన్న అతని తల్లిదండ్రులకు నిర్మాత కిషన్‌ ఈ రోజు ఉదయం 5గంటలకు సమాచారం అందించారు.

    తమ కుమారుడు క్షేమంగా వస్తాడని భావించిన విజయ్‌ తల్లిదండ్రులు గౌరిభాయి, రాజాసింగ్‌లు విషాద వార్త తెలుసుకుని దుఃఖసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పూర్తి సమాచారం తెలియజేసి, విజయ్‌సింగ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నెలక్రితం బాపట్లలో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన విజయ్‌సింగ్‌ విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇచ్చి వెళ్లారని... అతని జ్ఞాపకాలను తలచుకుంటూ స్నేహితులు, బంధువులు విలపించారు.

    English summary
    Telugu film actor Vijay dead body reach Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X