For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger కాంబినేషన్ లో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పూరి!

  |

  టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాను తెరకెక్కించినా కూడా జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగే పూరి జగన్నాథ్ తో సినిమాలు చేసేందుకు చాలా మంది యువ హీరోలు పోటీ పడుతూ ఉంటారు. మొదటిసారి ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని కూడా చెబుతున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ అయిపోగానే మరొక సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఈ కాంబినేషన్ సిద్ధమైంది. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ కూడా పూరి జగన్నాథ్ ఇచ్చేశారు.

  Recommended Video

  Puri Jagannath పంతం నెగ్గిచుకున్నాడు.. Vijay Devarakonda తో JGM | Filmibeat Telugu
  పవర్ఫుల్ బాక్సర్ గా..

  పవర్ఫుల్ బాక్సర్ గా..

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విభిన్నమైన సినిమాలతో తన మార్కెట్ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. మొదటి సినిమా నుంచి కూడా విజయ్ కు విభిన్నమైన కథలతో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ ను పెంచుకుంటూ ఉన్నాడు అనే చెప్పాలి. ఇక మొదటి సారి హీరో పూరి జగన్నాథ్ తో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను చేస్తూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఆ సినిమాలో విజయ్ ఒక పవర్ఫుల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

  హార్డ్ వర్క్ చేసి..

  హార్డ్ వర్క్ చేసి..

  అసలైతే లైగర్ సినిమాను ఒక 8 నెలల్లోనే పూర్తి చేసి తొందరగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోణ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినీ జీవితంలోనే ఈ సినిమాకు చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేసి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.

  డ్రీమ్ ప్రాజెక్ట్

  డ్రీమ్ ప్రాజెక్ట్

  ఇక లైగర్ సినిమా ఆగస్టులో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తవగానే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మరో సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన అనే స్టోరీని ఎప్పటినుంచో తెరపైకి తీసుకు రావాలి అని చూస్తున్నాడు.

   స్టార్ట్ ఎప్పుడంటే

  స్టార్ట్ ఎప్పుడంటే


  ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. మార్చి 29వ తేదీన మంగళవారం రోజు సినిమాను పెట్టబోతున్నట్లు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. యుద్ధ రంగంలో ఉండే ఆయుధాలను ఈ అద్భుతమైన పోస్టర్ లో హైలెట్ చేశారు. వీరిద్దరి తదుపరి మిషన్ ఈ నెల 29న ప్రారంభించబడుతుందట. 14:20 గంటలకు ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు చేయబడింది.

   మొదట ఆ హీరోలతో చేయాలని..

  మొదట ఆ హీరోలతో చేయాలని..

  దర్శకుడు పూరి జగన్నాథ్ జనగణమన అనే ప్రాజెక్టును మొదట పవన్ కల్యాణ్ తో చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా చేయాలని చాలాసార్లు చర్చలు జరిపాడు. మొదట మహేష్ బాబు కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గాడు. ఇక పూరి జగన్నాథ్ ఎలాగైనా ఈ సినిమాను తెరకెక్కించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా అతనికి లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ తో మంచి అనుబంధం ఏర్పడడంతో వెంటనే ప్రాజెక్టును స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

  English summary
  Vijay devarakonda another big project with after liger latest update on shooting
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X