»   » బిచ్చగాడు కోసం ఇంత పాకులాట అవసరమా? విజయ్ దేవరకొండ పై వార్త నిజమా రూమరా??

బిచ్చగాడు కోసం ఇంత పాకులాట అవసరమా? విజయ్ దేవరకొండ పై వార్త నిజమా రూమరా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Devarakonda planning To Do "Bicchagadu" Remake In Kannada

విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో చేసిన 'పిచ్చాయ్ క్కారన్' .. తెలుగులో 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలనుకున్న ఓ నిర్మాత, విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం. ఈ రీమేక్ చేయడానికి విజయ్ దేవరకొండ అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు.

'పెళ్లి చూపులు' సినిమాతో తనకి వచ్చిన క్రేజ్ ను 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ అమాంతంగా పెంచేసుకున్నాడు. ప్రస్తుతం మనోడి చేతిలో అరడజను తెలుగు సినిమాలు వున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే ఆయనకి రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కన్నడలో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Vijay Devarakonda in Bichhagadu Kannada Remake

ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. విజయ్ అప్పుడే పొరుగు భాషలోనూ ఫాలోయింగ్ పెంచుకునే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అతను కన్నడలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం 'బిచ్చగాడు' రీమేక్ మీద దృష్టిపెట్టాడంటున్నారు. ఓ ప్రముఖ కన్నడ నిర్మాత అతడితో 'బిచ్చగాడు' రీమేక్ ను నిర్మించడానికి ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.


పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల విజయ్ కి కన్నడ మీద మంచి పట్టే ఉంది. ఈ నేపథ్యంలో నేరుగా కన్నడ సినిమా చేయాలని చూస్తున్నాడట విజయ్. ఐతే విజయ్ ది సరైన ఆలోచనేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తమిళనాటో.. కేరళలోనో ఫాలోయింగ్ పెంచుకుంటే.. అక్కడి ప్రేక్షకుల్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించవచ్చు. ప్రతి సినిమానూ అనువాదం చేసుకోవచ్చు. అదనంగా ఆర్జించవచ్చు. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు. అక్కడ డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉంది. అలాంటపుడు విజయ్ ఏం సాధిస్తాడన్నది సందేహం.


English summary
A report coming from Sandalwood indicated that Vijay Devarakonda wants to star in a remake movie of Bichhagadu in Kannada debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu