»   » విజయ్ దేవరకొండ బర్త్ డే.. ఇంత వెరైటీగా ఎవరూ జరుపుకోరు, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే!

విజయ్ దేవరకొండ బర్త్ డే.. ఇంత వెరైటీగా ఎవరూ జరుపుకోరు, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే!

Subscribe to Filmibeat Telugu

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్ దేవర కొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. మంచి అవకాశాలతో కెరీర్ పరంగా విజయ్ జోరుమీద ఉన్నాడు.

Vijay Devarakonda birthday celebrations

ఎవడే సుబ్రహ్మణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన విజయ్ పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కాగా నేటి తన పుట్టిన రోజు వేడుకని వైరైటీగా సెలెబ్రేట్ చేసుకోవాలని విజయ్ భావించాడు.

తన పుట్టిన రోజు సందర్భంగా మూడు ఐస్ క్రీం ట్రక్కులు హైదరాబాద్ నగరంలో తిరగనున్నాయి. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఉచితంగా ఐస్ క్రీమ్స్ ని పబ్లిక్ కి అందజేయనున్నారు. ఈ విషయాన్ని విజయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

తనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో విజయ్ వివరించాడు. ఈ హాట్ హాట్ సమ్మర్ లో మూడురోజులు షూటింగ్ లో పాల్గొన్న తరువాత తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపాడు. ఇంత వెరైటీగా మరే హీరో పుట్టిన రోజు జరుపుకోలేదేమో. విజయ్ దేవర కొండ కీలక పాత్రలో నటించిన మహానటి చిత్రం కూడా ఈ రోజే విడుదలవుతుండడం విశేషం.

English summary
Vijay Devarakonda birthday celebrations. Vijay Devarakonda sends free ice cream trucks
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X