»   » నాపెళ్ళి చేసిన వాళ్ళకి థాంక్స్: పెళ్ళి చూపులు హీరో విజయ్

నాపెళ్ళి చేసిన వాళ్ళకి థాంక్స్: పెళ్ళి చూపులు హీరో విజయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత ఏడాది పెళ్లి చూపులు మూవీ తో వెండి తెర కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి తో రాబోతున్న ఈ యాంగ్ హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఈ రెండు రోజులుగా టాలీవుడ్ లో బాగానే చక్కర్లూ కొట్టింది. కెరీర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఒక స్టేజ్ కి వెళ్లబోతున్న విజయ్ పెళ్ళి చేసుకోబోతున్నాడనగానే చక చక అన్ని వెబ్సైట్లూ రాసేసాయి...

విజయ్ ప్రస్తుతం విమ్మి అనే అమ్మాయితో గాఢప్రేమలో మునిగిఉన్నాడట..ఇప్పటికే వీరి ప్రేమ ఇంట్లో పెద్దలకు తెలిసిపోయిందట. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలనీ ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని ఎవరు మొదలు పెట్టారో గానీ మొత్తానికి విమ్మీ అనే అమ్మాయి లక్కీ అని చెప్తూ ఇంకా కొన్ని వార్థలు వచ్చాయి. కానీ చివరికి తేలిందేమిటంటే ఈ విమ్మీ అనే క్యారెక్టరే లేదట అసలు. ఎవరో సృష్తించిన గాసిప్ అన్నమాట...

 Vijay Devarakonda to get engaged to his girl friend Vimmy is a rumor

అయితే విషయం మీద విజయ్ దేవరకొండ స్పందించాడు "నేను 14 గంటలు ఫ్లయిట్ జర్నీలో ఉంటే, అక్కడ ఇండియాలో నా పెళ్లి చేస్తున్నారంట. నా భార్య విమ్మీ సంగతి అటుంచితే, నా కొడుకులు రమ్మీ, డమ్మీ గురించి చెప్పడం మరిచిపోయినట్టున్నారు. నాకు పెళ్లి చేసిన ప్రెస్ కు కృతజ్ఞతలు." అంటూ తన స్టైల్లోనే చెప్పాడట విజయ్.

గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో, అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇప్పుడే కెరీర్ సెట్ అవుతూంటే మిగతా విషయాలగురించి ఆలోచించేంత టైం పెళ్లికింకా చాలా టైం ఉందంటున్నాడు విజయ్ దేవరకొండ. మామూలుగా అయితే హీరోయిన్ల మీద వస్తాయ్ గాసిప్పులు కానీ విజయ్ విషయం లో ఇది రివర్స్ లో ఉంది...

English summary
News on Pellichupulu Hero Vijay Devarakonda Engagement to his Girl Friend Vimmy is a rumor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu