For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లు ఏడ్చారు, అప్పుడే పెళ్లి, గోదావరి జిల్లాల అమ్మాయిని చూడండి: విజయ్ దేవరకొండ

  |

  విజయ్ దేవరకొండ నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం షూటింగ్ గత రెండు నెలలుగా కాకినాడలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ షూటింగ్ ముగియడంతో హైదరాబాద్ తిరిగి వస్తూ విజయ్ మీడియాతో ముచ్చటించారు. కాకినాడకు బిగ్ థాంక్స్. గడిచిన 2 నెలలుగా ఇక్కడే ఉన్నాను. కాకినాడతో పాటు అన్నవరం, తొండంగి ఏరియాలో షూటింగ్ చేశాం. ఇపుడు హైదరాబాద్ వెళ్లాలంటే అదోలా అనిపిస్తోంది. నాతో పాటు ఫ్రెండ్ రోల్స్ చేసిన వారంతా నిన్న ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి వెళుతుంటే ఎమోషనల్ అయి ఏడ్చారు. ఈ ప్రాంతంతో మాకు అంత అనుబంధం ఏర్పడిందని తెలిపారు.

  కాకినాడ బాగా నచ్చింది

  కాకినాడ బాగా నచ్చింది

  ఇలా వివిధ ప్రాంతాలు తిరగడం మా వృత్తిలో భాగమే, ఎక్కడైనా ఎక్కువ రోజులు ఉంటే ఆ ఏరియాతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. కాకినాడను మిస్సవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడికి సరైన సమయంలో వచ్చాం. వెదర్ కూడా బావుంది. చాలా మంది ఫుడ్ పంపించారు. మంచిగ తిని మంచిగ షూటింగులో పాల్గొన్నా.

   మా సినిమాలో భాగం అయినందుకు థాంక్స్

  మా సినిమాలో భాగం అయినందుకు థాంక్స్

  మేము ఇక్కడ కాలేజీల్లో షూట్ చేసినపుడు చాలా మంది స్టూడెంట్స్ సపోర్ట్ చేశారు. ఇక్కడి రోడ్లు, హాస్పిటల్స్‌లో షూటింగ్ చేశాం. జగన్నాథపురంలో జాతర సెట్లో షూట్ చేశాం. సినిమా విడుదలైన తర్వాత కాకినాడకు చెందిన వారితో మా సినిమా స్క్రీన్ కళకళలాడిపోతుంది. జూనియర్ ఆర్టిస్టులు కాకుండా ఇక్కడి లోకల్స్ వచ్చి నటించారు. మీరంతా మా సినిమాలో భాగం అయినందుకు థాంక్స్.

   సెట్ వేస్తే నేచురాలిటీ ఉండదు

  సెట్ వేస్తే నేచురాలిటీ ఉండదు

  దర్శకుడు భరత్ కథ చెప్పినపుడే కాకినాడలో జరిగే కథ అని చెప్పాడు. అతడు ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఇక్కడి వాతావరణం ఊహించుకుని రాశాడు. కావాలంటే హైదరాబాద్ లో సెట్ట్ వేయవచ్చు. కానీ నేచురాలిటీ ఉండదు. సినిమాలో పాత్ర, హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం ఎంత ఉందో.... కాకినాడ ప్రాంతం ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది.

   ట్రైన్ యాక్సిడెంటుపై

  ట్రైన్ యాక్సిడెంటుపై

  నాకు ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో చాలా మంది అభిమానులు కంగారు పడ్డారని తెలిసింది. సినిమాల్లో ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.

  రాజకీయాల గురించి

  రాజకీయాల గురించి

  కోడి పందాలు నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడకు వచ్చి చూస్తాను. అవి చూస్తే తప్ప వాటి ద్వారా వచ్చే కిక్ గురించి మాట్లాడలేను. ఇప్పుడే సినిమాల్లోకి వచచాను. అపుడే రాజకీయాల గురించి అడగొద్దు. అలాంటి ఆలోచన కూడా లేదు. అర్జున్ రెడ్డి చేసినపుడు డాక్టర్ అవుతారా అని ఎవరూ అడగలేదు. నోటా చేయగాలనే పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? అని అడగటం ఏమిటో అర్థం కావడం లేదు.

  పెళ్లి గురించి

  పెళ్లి గురించి

  పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.... లోపలి నుంచి అనిపిస్తే ఇప్పుడే చేసుకుంటా. అనిపించక పోతే ఐదు పదేళ్లయినా అవుతుందన్నారు. గోదావరి జిల్లాల్లో అమ్మాయిని చేసుకుంటారా? అనే ప్రశ్నకు బదులిస్తూ... ఎవరైనా అమ్మాయి అందంగా ఉండి, తెలివైనది అయుంటే చెప్పండి నచ్చితే తప్పకుండా చేసుకుంటాను అన్నారు.

  English summary
  Vijay Devarakonda Interacting With Media in Kakinada. The shooting of Vijay Devarakonda’s new film, 'Dear Comrade', a fun-filled action entertainer, shooting completed at Kakinada with Bharat Kamma wielding the megaphone and Mohan Cherukuri, Yash Rangineni, Ravi Shankar Yalamanchili and Naveen Yerneni producing the film under the banner of Myhtri Movie Makers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X