»   » అది ఇప్పుడే నేర్చుకుంటున్నా.. ఖతర్నాక్‌గా ఉంది.. ఎప్పుడెప్పుడా అని.. విజయ్ దేవరకొండ

అది ఇప్పుడే నేర్చుకుంటున్నా.. ఖతర్నాక్‌గా ఉంది.. ఎప్పుడెప్పుడా అని.. విజయ్ దేవరకొండ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'పెళ్లిచూపులు' చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్‌ దేవరకొండ మలి చిత్రం 'అర్జున్‌రెడ్డి'తో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రం సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ అవడంతో విజయ్‌ దేవరకొండకి యూత్‌లో విశేషమైన క్రేజ్‌ ఏర్పడింది. కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులార్టీని సంపాదించుకున్న విజయ్‌ దేవర కొండ నిర్మాతలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యారు. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు' ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందనున్నది.

  Vijay Devarakonda Coming With A New Game
  తెలుగు, తమిళ చిత్రం ప్రారంభం

  తెలుగు, తమిళ చిత్రం ప్రారంభం

  స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా తెలుగు, తమిళ్‌లో నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం. 14 చిత్రం మార్చి 5న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు, బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌, మైత్రి మూవీస్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, స్వ‌ప్న ద‌త్‌, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌, సందీప్‌ రెడ్డి వంగ పాల్గొన్నారు.

  విజయ్, మెహరీన్‌పై ముహూర్తం షాట్

  విజయ్, మెహరీన్‌పై ముహూర్తం షాట్

  పూజా కార్యక్రమాల అనంతరం హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ మెహరీన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, సందీప్‌ రెడ్డి వంగ, కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ మెహరీన్‌ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌, నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా, కెమెరామెన్‌ శాంత, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌, డిజైనర్‌ శ్రావ్య పాల్గొన్నారు.

   విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

  విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

  హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ - ''రోజులు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే యాక్టింగ్‌ నేర్చుకుంటున్నాను. స్టూడియో గ్రీన్‌ కె.ఇ. జ్ఞానవేల్‌ రాజాగారి బేనర్‌లో సినిమా చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. స్క్రిప్ట్‌ వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఫస్ట్‌టైమ్‌ తెలుగు, తమిళ్‌లో సినిమా చేస్తున్నాను.

   ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు..

  ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు..

  దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని యాంగ్జైటింగ్‌గా వుంది. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్నప్పుడు ఎంత టెన్షన్‌ పడ్డానో అంతే టెన్షన్‌గా అనిపిస్తుంది. డేట్స్‌ లేకపోయినప్పటికీ స్క్రిప్ట్‌ నచ్చడంతో.. ఎలాగైనా సినిమా చేయాలని డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి సినిమాకి ఓకే చెప్పాను. స్క్రిప్ట్‌ ఖతర్నాక్‌గా వుంది. యంగ్‌ టాలెంటెడ్‌ టీమ్‌తో వర్క్‌ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

   అర్జున్‌రెడ్డి ఐదుసార్లు చూశా

  అర్జున్‌రెడ్డి ఐదుసార్లు చూశా

  నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ - ''అర్జున్‌రెడ్డి' మూవీ ఐదుసార్లు థియేటర్‌లో చూశాను. విజయ్‌ దేవరకొండ అమేజింగ్‌ యాక్టర్‌. స్టూడియో గ్రీన్‌ బేనర్‌లో ఫస్ట్‌టైమ్‌ డైరెక్ట్‌ తెలుగు సినిమా విజయ్‌ దేవరకొండ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. మా ఫస్ట్‌ ఫిలిం హీరో విజయ్‌.

  ఈ కథకి విజయ్‌ అయితే

  ఈ కథకి విజయ్‌ అయితే

  ఆనంద్‌ శంకర్‌ బిగ్‌ మూవీస్‌ చేశారు. స్క్రిప్ట్‌ విని చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ కథకి విజయ్‌ అయితే కరెక్ట్‌ యాప్ట్‌ అని నమ్మి సినిమా తీస్తున్నా. శాంత కెమెరా, సి.ఎస్‌. శ్యాం మ్యూజిక్‌, ఆర్ట్‌ కిరణ్‌ అంతా బిగ్‌ మూవీస్‌కి వర్క్‌ చేసిన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నారు. మార్చి 8 నుండి ఫస్ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో చేసి సెకండ్‌ షెడ్యూల్‌ చెన్నైలో చేస్తాం అని జ్ఞానవేల్‌ రాజా అన్నారు.

   విక్రమ్‌తో ఇంకొక్కడు తర్వాత

  విక్రమ్‌తో ఇంకొక్కడు తర్వాత

  దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''విక్రమ్‌తో 'ఇంకొక్కడు' సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నాను. చెన్నైలో 'అర్జున్‌రెడ్డి' మూవీ చూశాను. బాగా నచ్చింది. ఆ సినిమా అన్ని భాషల్లో మంచి హిట్‌ అయ్యింది. విజయ్‌ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్‌కు గ్రేట్‌ అప్రిషియేషన్‌ వచ్చింది.

  తమిళం నేర్చుకొని డైలాగ్స్

  తమిళం నేర్చుకొని డైలాగ్స్

  తను నేను చెప్పిన స్క్రిప్ట్‌ విని ఎగ్జైట్‌ అయ్యాడు. విజయ్ తమిళ్‌ నేర్చుకొని డైలాగ్స్‌ చెబుతా అన్నాడు. అది తన కమిట్‌ మెంట్‌ ఏంటో చెబుతుంది. చాలా ప్యాషనేట్‌ హీరో. జ్ఞానవేల్‌ రాజా బిగ్‌ ప్రొడ్యూసర్‌. రవి కె. చంద్రన్‌ సన్‌ శాంత ఈ సినిమాకి డి.ఓ.పి చేస్తున్నాడు. సత్యరాజ్‌, నాజర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్‌ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది దర్శకుడు ఆనంద్ శంకర్ అన్నారు.

   విజయ్‌తో హోళీ సాంగ్‌లో

  విజయ్‌తో హోళీ సాంగ్‌లో

  హీరోయిన్‌ మెహరీన్‌ మాట్లాడుతూ - ''విజయ్‌ దేవరకొండతో ఇటీవల ఒక హోలి సాంగ్‌లో నటించాను. వెంటనే ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నాను. వెరీ డెడికేటెడ్‌ యాక్టర్‌. ఆనంద్‌ శంకర్‌ స్క్రిప్ట్‌ నేరేట్‌ చేయగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. స్టూడియో గ్రీన్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు, సాంకేతికవర్గం

  విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం: సి.ఎస్‌. శ్యాం, కెమెరా: శాంత, ఆర్ట్‌: కిరణ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: శ్రావ్య, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌, నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా.

  English summary
  Vijay Deverakonda, who shot to limelight with his hit film Arjun Reddy has a bunch of movies lined up, which are in various stages of production. He recently signed up for a bilingual that will be bankrolled by ace producer KE Gnanavelraja under his banner Studio Green. The film is going to be directed by Anand Shankar. This movie launched at Ramanaidu studio on March 5th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more