»   » పవన్ కళ్యాణ్ కంటే... విజయ్ దేవరకొండ 20 రెట్లు బెటర్!

పవన్ కళ్యాణ్ కంటే... విజయ్ దేవరకొండ 20 రెట్లు బెటర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Deverakonda​ 20 Times Better Than Pawan Kalyan : RGV

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తన కామెంట్లు, రివ్యూలతో మరింత ప్రచారం కల్పిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఆర్జీవీ తన వెర్షన్ రివ్యూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సినిమాను పొగడటంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హీరో విజయ్ దేవరకొండను పోలుస్తూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే విజయ్ దేవరకొండ 20 రెట్లు బెటర్ అంటూ వర్మ పేర్కొన్నారు.

శివ సినిమాతో అర్జున్ రెడ్డిని పోలుస్తూ

శివ సినిమాతో అర్జున్ రెడ్డిని పోలుస్తూ

తన దర్శకత్వంలో వచ్చిన ‘శివ' సినిమాతో ‘అర్జున్ రెడ్డి'ని పోలుస్తూ రామ్ గోపాల్ వర్మ..... ఈ రెండు సినిమాల మధ్య ఫండమెంటల్ డిఫరెన్సెస్ గురించి వివరించే ప్రయత్నం చేశారు. శివ సినిమా షాట్ టేకింగ్, షాట్ డివిజన్ మరియు క్యారెక్టరైజేషన్లో కొత్త ట్రెండ్. అర్జున్ రెడ్డి మూవీ శివకంటే బెటర్ గా ఉంది. ప్రతి సీన్ సినిమా చూసే వారికి ఐడెంటిఫికెబుల్, రిలేటబుల్ గా ఉంది. సినిమాలోని ఏడెనిమిది సీన్లు నా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు గుర్తు చేశాయి అని వర్మ తెలిపారు.

నటీనటుల ఎంపిక సూపర్

నటీనటుల ఎంపిక సూపర్

సినిమాలో నటీనటుల ఎంపిక కూడా చాలా బావుంది. ఎవరి ఆలోచనలకు అంతు పట్టకుండా ఉంది. సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదనిపించింది. కానీ సినిమా ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి ఆ రోల్ ఆమె తప్ప మరెవరూ అంత బాగా చేయలేరు అనే ఫీలింగ్ కలిగింది. సినిమాలోని ప్రతి పాత్ర విషయంలోనూ ఇలానే అనిపించిందని వర్మ తెలిపారు.

డైరెక్టర్ ఎబిలిటీ సూపర్

డైరెక్టర్ ఎబిలిటీ సూపర్

డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎబిలిటీ చూసి ఇంప్రెస్ అయ్యాను. అతడు హీరోను ప్రజంట్ చేసిన తీరు బావుంది. సినిమాను రియలిస్టిక్‌గా చూపించిన విధానం, ఎలాంటి కమర్షియల్ అంశాలకు తావు లేకుండా సినిమాను సినిమాలా తీసి ప్రేక్షకులను మెప్పించాడు అని.... వర్మ ప్రశంసించారు.

స్టోరీ

స్టోరీ

ఈ సినిమా కథ, అందులోని క్యారెక్టర్లు డైరెక్టర్ హైలీ మెచ్యూర్డ్ ఆలోచనలో నుండి వచ్చాయి. రియల్ లైఫ్, రియల్ పీపుల్, రియల్ సంఘటనల ఆధారంగానే దర్శకుడు ఈ సినిమా తీసినట్లు స్పష్టం అవుతోందని వర్మ అన్నారు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ లుక్, పెర్ఫార్మెన్స్ అద్భుతం. తెరపై అతడిని హీరోయిక్‌గా చూపించడానికి ప్రత్యేకంగా టెక్నిక్స్ అవసరం లేదు. స్వతహాగా అతడిలోనే ఆ టాలెంట్ ఉంది అని వర్మ అన్నారు.

అందరూ రియలైజ్ అయ్యేలా చేశారు

అందరూ రియలైజ్ అయ్యేలా చేశారు

తక్కువ బడ్జెట్‌లో, లిప్ సింక్ సాంగులు లేకుండా, మనుషులు గాల్లోకి ఎగిరిపడే యాక్షన్ సీన్లు లేకుండా, 3 గంటల నివిడితో, ఎలాంటి పంచ్ డైలాగులు లేకుండా, ఎలాంటి టాప్ టెక్నీషియన్స్ లేకుండా హైలీ ఇంపాక్టబుల్ సినిమా తీయొచ్చని సందీప్, విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోని అందరూ రియలైజ్ అయ్యేలా చేశారు అని వర్మ పొగడ్తలు గుప్పించారు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే.... లుక్, స్టార్ చరిష్మా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్లు బెటర్, పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాన్ కంటే 20 రెట్లు బెటర్ అని వర్మ పేర్కొన్నారు.

రియల్ పవర్ స్టార్

రియల్ పవర్ స్టార్

విజయ్ దేవరకొండలోని రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అతడికి ‘రియల్ పవర్ స్టార్' అని బిరుదు ఇవ్వాలి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

English summary
"To talk about VIJAY DEVERAKONDA in comparison in one line,he in both looks and star charisma is 10 times better than PAWAN KALYAN and he is 20 times better in performance than PAWAN KALYAN. Considering the extraordinary realism in his performance I think VIJAY DEVERAKONDA should be given the title REAL POWER STAR" RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu