twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శభాష్ విజయ దేవరకొండ, సూర్య.. సైనిక కుటుంబాలకు అండగా.. ఏం చేశారంటే

    |

    జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అమర వీరుల కుటుంబాలకు నైతిక మద్దతు కూడగడుతున్నారు. ఉగ్రవాద దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే ప్రజలు తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా సినీ హీరోలు విజయ్ దేవరకొండ, తమిళ నటుడు సూర్య విరాళాలు అందించడం విశేషం.. వివరాల్లోకి వెళితే..

    భారత్ కే వీర్ నిధికి విరాళాలు ఎలా

    భారత్ కే వీర్ నిధికి విరాళాలు ఎలా

    భారత్‌ కే వీర్ అనే వెబ్‌సైట్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, సామాన్య ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ నిధికి సుమారు రూ.15 లక్షల వరకు నేరుగా విరాళం అందించవచ్చు. 15 లక్షల మొత్తం కంటే ఎక్కువ ఇవ్వాలనుకొంటే సైనిక నిధిని ఏర్పాటు చేసే మరో సంస్థకు విరాళం అందించవచ్చు.

    ప్రభుత్వ పర్యవేక్షణలో నిధి

    ప్రభుత్వ పర్యవేక్షణలో నిధి

    భారత్ కే వీర్ అనే కార్పస్ ఫండ్ అకౌంట్‌కు భారత ప్రభుత్వం నియమించే కమిటి బాధ్యత వహిస్తుంది. ఇందులో ప్రముఖులు, స్వచ్చంద సేవకులు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. సైనిక కుటుంబాల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తారు. ఈ నిధి సైనిక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది.

    విజయ దేవరకొండ విరాళంతో

    విజయ దేవరకొండ విరాళంతో

    తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవకొండ ఈ నిధికి విరాళం అందించి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు. తాను విరాళంగా ఇచ్చిన చెక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు. మన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. మనం ఇచ్చే విరాళాలతో సైనికుల ప్రాణాలను వెలకట్టలేం. కానీ మన వంతు సహాయాన్ని అందిద్దాం. అందరం ఇందులో భాగమై ఓ నైతిక మద్దతును ఇద్దాం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

    సైనికులకు అండగా హీరో సూర్య

    సైనికులకు అండగా హీరో సూర్య

    సైనికుల కుటుంబాలకు ఆసరాగా నిలువడానికి భారత్కే వీర్ లింక్‌ను క్లిక్ చేయండి. వ్యక్తిగతం వీలైనంతగా విరాళాలు అందించండి. బాధితులకు సహాయం చేయడం ద్వారా మనం వారికి ఉపశమనం కలిగించవచ్చు అని సూర్య ట్వీట్ చేశారు.

    English summary
    Actors Vijay Deverkonda, Suriya comes forward to support https://bharatkeveer.gov.in. You can donate directly to individual braveheart's account (upto max of ₹ 15 lakhs) or may donate to the Bharat Ke Veer corpus.To ensure maximum coverage, a cap of ₹ 15 lakhs is envisaged per braveheart and the donor would be alerted if the amount exceeds ₹ 15 lakhs, so that they can choose to either decrease their contribution or divert part of the contribution to another bravehearts account, or to the Bharat Ke Veer corpus.Bharat Ke Veer corpus would be managed by a commitee made up of eminent persons of repute and senior government officials, in equal number, who would decide to disburse the fund equitably to the bravehearts family on need basis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X