»   » క్రాంతిమాధవ్‌‌తో విజయ్‌ దేవరకొండ: టాలీవుడ్‌కి మరో రేర్ కాంబినేషన్

క్రాంతిమాధవ్‌‌తో విజయ్‌ దేవరకొండ: టాలీవుడ్‌కి మరో రేర్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Hero Vijay Devarakonda Teaming Up With Kranthi Madhav

'అర్జున్‌రెడ్డి' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన విజయ్‌ దేవరకొండ వరుసగా మంచి మంచి అవకాశాలే సంపాదించుకుంటున్నాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పై ఉండగా, మిగతా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దర్శకుడికి కూడా విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు .. కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించే క్రాంతిమాధవ్.

కె.ఎస్‌. రామారావు

కె.ఎస్‌. రామారావు

ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ ‘జీఏ2' నిర్మిస్తున్న రెండు చిత్రాలకు సంతకాలు చేసిన విజయ్ తాజాగా క్రాంతిమాధవ్‌ చెప్పిన స్క్రిప్ట్ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి

నిజానికి ఈ కాంబో "పెళ్ళిచూపులు" సమయం లోనే ఫిక్స్ అయ్యింది కానీ పట్టాలమీదకి రావటానికి ఇంత టైం పట్టిందన్న మాట. ‘అర్జున్ రెడ్డి' సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పై ఉండగా, మిగతా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి.

అందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందనీ, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. దీనిని బట్టి పాత ప్లానింగ్ లో విజయ్ దేవరకొండ మార్పులు చేసి ఉంటాడనే విషయం అర్థమవుతోంది. అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఫుల్ సాఫ్ట్ సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో మరి.

త్వరగా సెట్స్ పైకి

త్వరగా సెట్స్ పైకి

'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలతో తన సత్తా చాటుకున్న క్రాంతి మాధవ్, ప్రస్తుతం సునీల్ తో 'ఉంగరాల రాంబాబు' సినిమా తెరకెక్కించి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆయన వినిపించిన ఒక కథ బాగా నచ్చేయడంతో, వెంటనే ఈ సినిమాను చేయడానికి విజయ్ దేవరకొండ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడట. కె.ఎస్.రామారావు నిర్మించనున్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు.

English summary
The latest buzz from the film nagar reveals us that the Hero Vijay Devarakonda might next be seen teaming up with the feel-good movie maker Kranthi Madhav.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu