For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మురగదాస్ 'తుపాకి' విడుదల తేదీ ఖరారు

  By Srikanya
  |

  చెన్నై : విజయ్,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'తుపాకి' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 9 న విడుదల కానుంది. ఈ విషయాన్ని చెన్నై లో నిన్న జరిగిన 'తుప్పాక్కి' ఆడియో పంక్షన్ లో మురగదాస్ తెలియచేసారు. వి క్రియేషన్‌ పతాకంపై హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చిన 'తుప్పాక్కి' ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఇదే పేరిట శోభారాణి నిర్మాణంలో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో 'లక్ష్మీనరసింహ'గా పునర్నిర్మితమైన 'సామి', 'ఘర్షణ'గా వచ్చిన 'కాక్క కాక్క' కలయికే ఈ 'తుపాకి' . తమిళంతోపాటు తెలుగులోనూ దీపావళికి పేలనుంది. అక్కడా భారీస్థాయిలో విడుదల చేస్తున్నాం. తప్పకుండా తెలుగువారికి నచ్చుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విలువలు ఇందులో ఉన్నాయి అన్నారు శోభారాణి.

  దర్శకుడు మురుగదాస్‌ మాట్లాడుతూ... ఇది ముంబయి నేపథ్యంలో సాగే కథ. కేవలం విజయ్‌ను ఇష్టపడేవారు మాత్రమే కాదు, ఆయన్ను అభిమానించనివారు కూడా ఎన్నిసార్లు చూసినా విసుగురాని చిత్రం 'తుప్పాక్కి'. ఇందులోని 'గూగుల్‌.. యాహూ..' అనే పాటను విజయ్‌ ఆలపించారు. ఆయన్నుంచి గరిష్టంగా ఎంత నటన తీసుకురావచ్చో.. కష్టపడి అదంతా రాబట్టాను. ఇందులో కొన్ని సన్నివేశాల్లో కథానాయకుడు హిందీలో మాట్లాడాల్సి వచ్చింది. అది చెన్నై యాసలా కాకుండా.. ఉత్తరాదిలోలా ఉండేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఆ యాసలో విజయ్‌ ఎలాంటి తప్పుల్లేకుండా మాట్లాడారు. అప్పుడే అనుకున్నా.. ఆయనతో హిందీచిత్రం చేయాలని. 'తుప్పాక్కి' పూర్తయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా. నా ప్రతి సినిమా విజయానికి ముఖ్య కారకులు.. సహాయ దర్శకులే. అందుకే వాళ్లను ఇలాంటి కార్యక్రమాల్లో వేదికలెక్కిస్తా అన్నారు.

  విజయ్‌ మాట్లాడుతూ... ఇందులో 'గూగుల్‌.. యాహూ' పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది. అన్ని గీతాలు బాగా వచ్చాయి. కమర్షియల్‌ హంగులన్నీ కలబోసిన చిత్రమిది. నిర్మాత, దర్శకులు, సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఇలా అందరూ ఎంతో ఉత్సాహంతో పనిచేశారు. నటి కాజల్‌ పేరులోనే స్వీట్‌స్టాల్‌ను(అగర్వాల్‌) కలిగి ఉంది. ఈ సినిమాలో ఆమెమై హార్ట్‌ స్వీట్‌, స్పైసీ గాళ్‌. మురుగదాస్‌తో తొలిరోజు నుంచే ఎంతో ఉత్సాహంగా పనిచేశా. సెట్‌లో ఆయనకు మేం 'కుట్టి మణిరత్నం' అని పేరుపెట్టాం అన్నారు.

  తమిళ నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాట్లాడుతూ... విజయ్‌తో 'సచిన్‌' తర్వాత 'తుప్పాక్కి' నిర్మిస్తున్నాను. ఇందులో విజయ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపిస్తారని అందిరికీ తెలిసిందే. సరైన సమయంలో వస్తోందని చెప్పొచ్చు. నిర్మాత వద్ద ఖర్చు పెట్టించే దర్శకులు, నటులే ఎక్కువ. అయితే నాకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా విజయ్‌ అడిగి తెలుసుకుని మరీ అవసరమైనంత నగదుతో చెక్కులు పంపించారు. 'శివాజి'లో కూడా రజనీకాంత్‌ కేవలం వెయ్యి రూపాయలు తీసుకుని నటించారు. విడుదలయ్యాకే పూర్తి పారితోషికం తీసుకున్నారు. ఇలాంటి గుణం అందరికీ ఉంటే పరిశ్రమ చల్లగా ఉంటుంది. ఈ సినిమాను చూసి హారిస్‌ ఒక మాట చెప్పారు. ''నేను 2004లో 'కాక్క కాక్క'కు సంగీతం అందించా. అందుకు పది రెట్లు అద్భుతంగా ఉందీ చిత్రం'' అన్నారు. ఆ మాట వింటే ఎంతో ఆనందంగా ఉంది. నిజంగానే అంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు అన్నారు.

  English summary
  A R Murugadoss’ upcoming film Thuppaki is expected to hit the screens in Tamil and Telugu on November 9. Vijay and Kajal have played the lead roles in this action entertainer.The film is set in Mumbai and it presents Vijay in a never before seen avatar. Santosh Sivan is the cinematographer and Harris Jayaraj has composed the music. Shoba Rani has bought the distrubution rights for the Telugu version for a whopping price.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X