»   » గుండెజారి గల్లంతయ్యిందే... డైరెక్టర్ రహస్యంగా ప్రేమ వివాహం!

గుండెజారి గల్లంతయ్యిందే... డైరెక్టర్ రహస్యంగా ప్రేమ వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: తెలుగులో ఒక లైలా కోసం, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ప్రసూనను పెళ్లాడారు. అయితే వీరి వివాహం ఇండస్ట్రీలోని వారికి గానీ, మీడియాకుగానీ సమాచారం లేకుండా రహస్యంగా జరిగింది.

మార్చి 1న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11.23 గంటలకు వీరి పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచితే బావుండదనే స్నేహితుల సలహా మేరకు.... తనకు పెళ్లయిన విషయాన్ని ఖరారు చేస్తూ అదేరోజు సాయంత్రం పెళ్లి శుభలేఖను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

విజయ్ కుమార్ కొండ, ప్రసూన కొంత కాలంగా స్నేహితులు. ఈక్రమంలో ఇద్దరూ ప్రేమికులుగా మారారని, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నట్లు సమాచారం.

ఇదే పెళ్లి శుభలేఖ

ఇదే పెళ్లి శుభలేఖ

విజయ్ కుమార్ కొండ, ప్రసూన పెళ్లి శుభలేఖ ఇదే. ఇండస్ట్రీకి చెందిన ఎవరికీ ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. కొందరు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారట.

సినిమాలు

సినిమాలు

2013లో నితిన్ హీరోగా తెరకెక్కించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి హిట్టు కొట్టడంతో నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు.

చేస్తున్న సినిమాలు

చేస్తున్న సినిమాలు

విజయ్ కుమార్ కొండ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడట. వరుణ్ ప్రస్తుతం మిస్టర్ , ఫిదా అనే చిత్రాలు చేస్తుండగా వీటి తర్వాత తన మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

English summary
Oka Laila Kosam director Vijay Kumar Konda, who debuted with actor Nithiin’s Gunde Jaari Gallan-thayyinde got secretly married to Prasunna, his long-time girlfriend at a private ceremony recently.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu