twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణలో 'బాద్‌షా' బహిష్కరణ ప్రకటన

    By Srikanya
    |

    హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' చిత్రాన్ని తెలంగాణ ప్రాంతంలో బహిష్కరిస్తున్నట్లు తెరాస ఎంపీ విజయశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చలనచిత్ర ఆడియో విడుదల ఉత్సవంలో జరిగిన అపశ్రుతిలో వరంగల్‌ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడు చనిపోయాడని, అతడి మృతికి కనీసం సంతాపం తెలపకుండా కార్యక్రమాన్ని కొనసాగించారని, ఇది సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమని, దీనికి నిరసనగా తెలంగాణలో ఈ చిత్రాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.

    నిర్మాత బండ్ల గణేశ్ మృతుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థి క సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచా రం వ్యక్తం చేశారు. కాగా, హీరో ఎన్టీఆర్ స్టేజీ పైకి చేరుకుని వరంగల్ జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంజా రాంబాబు పిలిపించుకున్నాడు. ఈ సందర్భం గా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ తల్లికి కుమారున్ని ఇవ్వలేను కానీ, చనిపోయిన కుటుంబానికి పెద్దకుమారుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అభిమానులు ఇళ్లకు జాగ్ర త్తగా వెళ్లాలని అభిమాని మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆడియో ఆవిష్కరణ గురించి మాటమాత్రమైన మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

    జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన బాద్‌షా సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశ్రుతి చోటుచేసుకొంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ శివారు నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియో ఆవరణలో నిర్వహించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎన్టీఆర్‌ ప్రాంగణానికి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ప్రవేశద్వారం వద్దకు చేరుకొన్నారు.

    ఆ సమయంలో తొక్కిసలాట జరగటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. వరంగల్‌లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులపై రాయదుర్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    పరిమితికి మించి పాస్‌లను జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 3 వేల వీవీఐపీ సీట్ల సామర్థ్యం ఉండగా 20 వేల మందికి పైగా పాస్‌లు మంజూరు చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి అనుమతి ఉన్నప్పటికీ ఎక్కువ పాస్‌లు జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సైబరాబాద్‌ పోలీసుకమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

    English summary
    TRS MP Vijaya Santi expressed anger at Baadshaw producers for not postponing the audio launch despite the death. Stating that this reflected the Seemandhra arrogance, Vijaya Santi said in a statement in Delhi, that they would give a call for the boycott of the film in the Telangana region.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X