For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేసీఆర్‌కి రాములమ్మ పవర్‌ఫుల్ పంచ్.. సరిలేరు నీకెవ్వరు అనిపించేలా కౌంటర్!

  |

  వెండితెరపై ఓ వెలుగు వెలిగిన లేడీ అమితాబ్ బచ్చన్.. రాజకీయ రంగంలోనూ తనదైన మార్క్ చూపించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన ఆమె ఆ తర్వాత దాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తోంది. మరోవైపు ఇటీవలే సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తూ ముఖానికి రంగేసుకుంది. ఈ తరుణంలో ఆమె పొలిటికల్ యాంగిల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సెటైర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

  25 రోజుల ఆర్టీసీ సమ్మె.. దిగిరాని ప్రభుత్వం

  25 రోజుల ఆర్టీసీ సమ్మె.. దిగిరాని ప్రభుత్వం

  తెలంగాణ రాష్ట్రంలో గత 25 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు పెట్టిన డిమాండ్స్ నెరవేర్చేంత బడ్జెట్ తమ వద్ద లేదంటూ చేతులెత్తేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓ వైపు మనస్తాపంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం దిగిరావడం లేదు. దీంతో రాష్ట్రమంతా ఈ ఇష్యూపై చర్చలు ముదిరాయి.

  హైకోర్టు జోక్యం.. రాములమ్మ ఎంటర్

  హైకోర్టు జోక్యం.. రాములమ్మ ఎంటర్

  ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకున్న హైకోర్టు ఈ విషయమై త్వరగా ఓ నిర్ణయానికి రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది.. తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధుల లేమి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కోసం 47 కోట్ల రూపాయలు వెచ్చించలేదని వాదించాడు. దీంతో ఇదే విషయమై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా కౌంటర్ వేసింది.

  విజయశాంతి లాజిక్.. అదే జరిగితే

  విజయశాంతి లాజిక్.. అదే జరిగితే

  ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి కనీసం 47 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేనప్పుడు, హుజూర్‌నగర్‌లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కేసీఆర్ ఎలా ప్రకటించారని కోర్టు నిలదీసిన సంగతిని గుర్తుచేస్తూ పోస్ట్ పెట్టింది విజయశాంతి. ఒకవేళ హుజూర్‌నగర్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని విజయశాంతి లాజిక్ ప్లే చేసింది.

  రాములమ్మపై కామెంట్స్.. కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని!

  కోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని తన పోస్ట్ లో పేర్కొన్న రాములమ్మ.. తాజా పరిస్థితులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ఇచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోందని పేర్కొంటూ స్ట్రాంగ్ సెటైర్ వేసేసింది. దీంతో ఈ పెట్టిన ఈ సందేశం చూసి సరిలేరు నీకెవ్వరు రాములమ్మ అని కామెంట్ చేస్తుండటం గమనార్హం.

  దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత

  దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత

  విజయశాంతి వెండితెరపై కనబడక దాదాపు పద్నాలుగేళ్లు అవుతోంది. చివరగా 'నాయుడమ్మ' చిత్రంలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది. మళ్లీ ఇన్నేళ్లకు మేకప్ వేసుకుని వెండితెరపై విజృంభించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఇక ముందు ఈమె పొలిటికల్, సినీ జర్నీ ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  భారతి రోల్.. బాగా పవర్‌ఫుల్

  భారతి రోల్.. బాగా పవర్‌ఫుల్

  మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి.. భారతి అనే పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆమెకు సంబంధించి ఇటీవలే లుక్ రిలీజ్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Mahesh Babu doing his next project with Anil Ravipudi. For this movie once again selected music director as Devi Sri Prasad. And this movie title fixed as 'Sarileru Nekevvaru'. In this movie Vijayashanthi acts as Bharthi. Now she was post a comment on Kcr.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X