ఎన్టీఆర్ 'బృందావనం' విజయోత్సవ వేడుక ఎప్పుడు..ఎక్కడ
"బృందావనం" విజయం సాదించటంతో జూ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని ఆయన విజయవాడలో చేయాలని నిర్ణయించారు. తన అభిమానులు సమక్షంలో ఆ ఆనందాన్ని పంచుకోలని నిర్మాత దిల్ రాజుతో కలిసి నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరగనుంది. ఆ పంక్షన్ లో పాలుపంచుకునేందుకు తన అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, తన హీరోయిన్స్ (కాజల్, సమంత) లతో ఈ పంక్షన్ లో కనపడనున్నారు. ఇక ఎన్టీఆర్..ఈ చిత్రం విజయంతో ఫ్యామిలీలకు కూడా ఆకట్టుకునే కొత్త ఇమేజ్ వచ్చిందని భావిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ కి బాలకృష్ణని కూడా రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఫంక్షన్ ని మొదట గుంటూరులో చేస్తానని ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. కానీ తర్వాత విజయవాడ అని కన్ఫర్మ్ చేసారు.
జూ ఎన్టీఆర్ బృందావనం వంశీ పైడిపల్లి దిల్ రాజు అదుర్స్ సమంత కాజల్ jr ntr brindavanam dil raju vamsi paidipalli adurs samantha kajal


Click it and Unblock the Notifications