2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్
హైదరాబాద్: విజయేంద్ర ప్రసాద్... తెలుగు ప్రముఖ రచయితల్లో ఒకరు. అంతకు ముందు ఆయన చాలా సినిమాలు చేసినా దేశ వ్యాప్తంగా బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాతే. 2015లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలైన ఈ చిత్రాలు రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసాయి.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. సౌత్ నుండి వచ్చిన ఒక చిత్రం ఉత్తరాధిన భారీ విజయం సాధించడం అదే తొలిసారి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'బజరంగీ భాయి జాన్' చిత్రం కూడా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించినందుకు గాను తనకు తొలుత రూ. 40 లక్షలు ఆఫర్ చేసారని, తాను రూ. 2.5 కోట్లకంటే ఒక పైసా తక్కువకు కూడా స్టోరీ ఇవ్వనని చెప్పాను. చివరకు రూ. 2 కోట్లు డీల్ సెట్టయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి' సీక్వెల్స్ కు సంబంధించిన కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ బాహుబలి-2కు స్ర్కిప్టు రాయడం పూర్తయింది...షూటింగు కూడా మొదలైంది. దీని తర్వాత బాహుబలి-3 కూడారాబోతోందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











