»   » 100 కోట్ల సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ..

100 కోట్ల సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భజరంగీ భాయ్‌జాన్, బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాడు సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ అంటే కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్నది. పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆయన కథ అందిస్తే సినిమా తీయాలని ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నది. దేశ రాజకీయాల్లో ప్రభావమంతమైన పాత్రను పోషిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆరెస్సెస్) ప్రస్థానంపై తీయబోయే ఓ సినిమాకు కథను అందిస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

Vijayendra Prasad is penning for RSS movie

తమ సంస్థ గురించి తీయబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుంది అని భావించిన నేతలు ఆయనను సంప్రదించారట. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ మద్దతుతో ఈ సినిమా తెరకెక్కనున్నదట. ప్రస్తుతం కథ కోసం సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టు ఓ జాతీయ పత్రిక కథనాన్ని వెల్లడించింది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని మీడియా సమాచారం.

English summary
Baahubali, Bajrangi Bhaijaan fame Vijayendra Prasad is penning for a Rs.100 crores project. Reports suggest that the writer is giving a story for Rashtriya Swayamsevak Sangh ( RSS). The movie is going to picturise of RSS life journey. BJP is to backing the project at Bollywood level.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu