»   » ‘బాహుబలి-2’కు అంత సీన్ లేదు... రాజమౌళి తండ్రి సంచలనం!

‘బాహుబలి-2’కు అంత సీన్ లేదు... రాజమౌళి తండ్రి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొంతకాలంగా ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఒక ఆసక్తికర పోరు సాగుతోంది. 'బాహుబలి-2', 'దంగల్' ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాది పైచేయి అవుతుందనే టాపిక్ నడుస్తోంది. బాహుబలి 2 సినిమా కంటే ముందు విడుదలైన 'దంగల్' రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియాలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నెం.1 స్థానం దక్కించుకోగా..... ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 మూవీ రూ. 1500 కోట్లకుపైగా వసూలు చేసి 'దంగల్' రికార్డును తొక్కేసింది.

అయితే తర్వాత చైనాలో విడుదలైన 'దంగల్' అక్కడ సంచలన విజయం సాధించి ఓవరాల్‌గా దాదాపు రూ. 2000 కోట్ల గ్రాస్ సాధించి బాహుబలిని వెనక్కి నెట్టేసింది. తాజాగా 'బాహుబలి 2' కూడా చైనాలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏ సినిమాది పైచేయి కాబోతోందనే హాట్ టాపిక్ మొదలైంది.


రాజమౌళి తండ్రి సంచలనం

రాజమౌళి తండ్రి సంచలనం

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘బాహుబలి' రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. చైనా రిలీజ్ తర్వాత కూడా బాహుబలి 2 మూవీ ‘దంగల్' రికార్డును బద్దలుకొట్టలేదని, బాహుబలి 2 చిత్రానికి అంత సీన్ లేదని కామెంట్ చేశారు.


SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
చైనాలో వర్కౌట్ కాదు

చైనాలో వర్కౌట్ కాదు

చైనా ప్రజలు బాహుబలి లాంటి డ్రామాలు చాలా చూశారు. అలాంటి సినిమాలు చైనాలో ఇప్పటి వరకు చాలా వచ్చాయి. అందు వల్ల చైనాలో ‘బాహుబలి 2' అంతగా వర్కౌట్ కాక పోవచ్చు అని విజయేంద్రప్రసాద్ అన్నారు.


దంగల్ అందుకే హిట్

దంగల్ అందుకే హిట్

‘దంగల్' మూవీ చైనాలో అంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఆ చిత్ర కథే. కూతురు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చారు అనే ఉమెన్ సెంట్రిక్ డ్రామాకు చైనా ప్రజలు కనెక్ట్ అయ్యారు. అందువల్లే ఆ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది అన్నారు.


నిర్మాతల్లో ఆశలు

నిర్మాతల్లో ఆశలు

విజయేంద్ర ప్రసాద్ వాదన ఎలా ఉన్నా.... బాహుబలి 2 నిర్మాతలు మాత్రం సినిమా చైనాలో వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. దంగల్ రేంజి హిట్ కాక పోయినా చైనాలో డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.English summary
Vijayendra Prasad, the ace writer who had created the world of 'Baahubali' on paper, however believes that Baahubali 2 can't surpass Dangal. In one of his recent interviews, he reasoned, 'Chinese people have seen umpteen costume dramas like Baahubali 2 so I feel that it will not work there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu