»   » ఆయన ముందు చేతులు కట్టుకొంటా.. విజయేంద్ర ప్రసాద్.. ఆ సీక్వెల్స్‌కు కథ రాస్తున్నా

ఆయన ముందు చేతులు కట్టుకొంటా.. విజయేంద్ర ప్రసాద్.. ఆ సీక్వెల్స్‌కు కథ రాస్తున్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ వస్తున్నది. సంచలన దర్శకుడు శంకర్ రూపొందించే చిత్రానికి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ చరిత్ర తిరుగరాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒకే ఒక్కడు, విక్రమార్కుడు చిత్రాలకు కథ రాస్తుండటం గమనార్హం.

రాజమౌళి, శంకర్ చిత్రాలకు కథ..

రాజమౌళి, శంకర్ చిత్రాలకు కథ..

గతేడాది భజరంగీ భాయ్‌జాన్, బాహుబలి2 చిత్రాలు కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా శంకర్, రాజమౌళి చిత్రానికి కథ అందిస్తున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం శంకర్ రోబో2 పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

శంకర్ ముందు చేతులు కట్టుకొంటా

శంకర్ ముందు చేతులు కట్టుకొంటా

శంకర్ అడిగితే కథ రాస్తారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏ డైరెక్టర్ అయినా కథ రాయమంటే తప్పకుండా రాస్తాను. స్వయంగా తానే కథ రాసి.. ఆ కథతో సినిమా చేయమని శంకర్‌ను చేతులు కట్టుకొని అడుగుతా అని అన్నారు. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి కథ అందించిన ఆయన సాధారణ కథా రచయిత మాదిరిగా సమాధానం ఇవ్వడం ఆయనకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని తెలియ చెప్పినట్లయింది.

సీకెల్స్ కథ రాస్తున్నా..

సీకెల్స్ కథ రాస్తున్నా..

ప్రస్తుతం శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ రాస్తున్నాను. ఆ సీక్వెల్ అచ్చు గుద్దినట్టు అలానే ఉండకపోవచ్చు. కానీ కథ మాత్రం అదే పంథాలో సాగుతుంది. ఒకే ఒక్కడుకు అది సీక్వెల్ అయినప్పటికీ.. అదీ మాత్రం బాలీవుడ్ చిత్రం కోసం రాస్తున్నాను అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

విక్రమార్కుడు సీక్వెల్ వస్తుంది..

విక్రమార్కుడు సీక్వెల్ వస్తుంది..

రాజమౌళి రూపొందించిన విక్రమార్కుడు చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నది. అంతేకాకుండా ఆ చిత్రం కన్నడ, హిందీలలో రీమేక్ అయింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలని కోరుకొందాం.

English summary
Ace story writer Vijayedra Prasad is penning for Shankar's Oke Okkadu, Rajamouli's Vikramarkudu movie sequels. He said Oke Okkadu sequel to be happen in bollywood. Baahubali writer is so confident on Oke Okkadu sequel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu