»   » నిజం: 'బాహుబలి' రైటర్ టీవి సీరిస్ రాస్తున్నారు,డిటేల్స్

నిజం: 'బాహుబలి' రైటర్ టీవి సీరిస్ రాస్తున్నారు,డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, 'బాహుబలి', బజరంగి భాయీజాన్ వంటి మెగా హిట్స్ రచయిత విజియేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఓ టీవి సీరియల్ రచనలో నిమగ్నమయ్యారని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు గోల్డెన్ భెల్ దర్శకత్వంలో ఈ టీవి షో తెరకెక్కనుంది. రజనీదుగ్గల్, రాధ కూతురు కార్తిక ఈ టీవి షోలో ప్రధానపాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

ఒకవైపు బాహుబలి రెండవ పార్ట్ కథకు నగిషీలు చెక్కుతూ మిగతా సినిమా కథలు రాస్తూ, ఓ ప్రక్క వల్లి అనే సినిమా దర్శకత్వంనే మరోవైపు బుల్లితెరపై కూడా తన స్టోరీ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే రెండు సినిమాలు స్క్రిప్టులు రాస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఈ హిందీ సీరియల్‌కు స్క్రిప్ట్ రాయటంతో బాలీవుడ్ లో స్టార్ రైటర్ గా మారుమ్రోగుతారని అంచనాలు వేస్తున్నారు.

Vijayendra Prasad writes for a TV series

ఇది ఇలా ఉంటే..ఒకే ఒక్కడు' హిందీ వెర్షన్ 'నాయక్'కు సీక్వెల్ రాబోతోందట. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి దీపక్ ముకుత్ అనే నిర్మాత 'నాయక్'కు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సీక్వెల్ కు కథ కూడా సిద్ధం చేశాడట. హీరో హీరోయిన్లు.. దర్శకుడు ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తారని చెప్తున్నారు. మరికొద్ది రైటర్లతో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను పూర్తి స్థాయి స్క్రిప్టుగా మలుస్తున్నట్లు చెబుతున్నారు. 'నాయక్'లో అనిల్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి హైపే వచ్చింది కానీ.. బాక్సాఫీస్ ఏవరేజ్ మూవీగా మిగిలిపోయింది.

English summary
Writer of the Baahubali series and father of S.S. Rajamouli, Vijayendra Prasad will be penning the script for an upcoming TV series.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu